Breaking News

ఫోక్స్‌వ్యాగన్ టైరాన్.. రూ.5 లక్షల తక్కువ ధరకు!

Published on Sat, 07/11/2026 - 11:33

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా.. టైరాన్ లైనప్‌లో కొంత తక్కువ ధరలో ఉండే ఐదు సీట్ల ఎంట్రీ లెవల్ మోడల్ 'టైరాన్ లైఫ్‌'ను రూ. 41.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఆర్-లైన్ (రూ. 46.99 లక్షల) ధర కంటే రూ. 5 లక్షలు తక్కువ.

టైరాన్ ఆర్-లైన్ ఏడు సీట్ల వాహనం. అయితే టైరాన్ లైఫ్ ఐదు సీట్ల మోడల్. దీని అల్లాయ్ వీల్స్ ఆర్ లైన్ కంటే కొంత చిన్నగా ఉంటాయి. డ్యూయల్-టోన్ ఇంటీరియర్ అప్‌హోల్స్టరీ ఉంటుంది. కానీ డోర్, స్టీరింగ్ వీల్‌పై ఉండే 'R' బ్యాడ్జ్‌లు లేవు. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఆర్-లైన్‌లోని 15-అంగుళాల డిస్‌ప్లేకు బదులుగా ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ 12.9-అంగుళాల యూనిట్‌ ఉంది. ముందు సీట్లకు మసాజ్ ఫంక్షన్ లభిస్తుంది. వెనుక లోగోలు, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి.

టైరాన్ లైఫ్ కూడా 2.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 201bhp పవర్ 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుంది. ఈ కారును కూడా కంపెనీ కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది.

ఇదీ చదవండి: 2026 టాటా స్టెల్త్ ఎడిషన్స్: ధర, వివరాలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)