Breaking News

అమ్మకాల్లో అదరగొట్టిన టైగన్.. మూడేళ్ళలో లక్ష!

Published on Mon, 09/23/2024 - 19:11

టైగన్ అమ్మకాల్లో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అరుదైన మైలురాయిని చేరుకుంది. మూడేళ్ళ క్రితం భారతీయ విఫణిలో అడుగెట్టిన ఈ కారు ఏకంగా 100000 యూనిట్ల సేల్స్ పొందగలిగింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్ (SIAM) గణాంకాల ప్రకారం.. దేశీయ మార్కెట్లో మాత్రమే 67140 మంది ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 32742 కార్లను కంపెనీ ఎగుమతి చేసింది.

ఆగష్టు చివరి నాటికి టైగన్ అమ్మకాలు మొత్తం 99882 యూనిట్లు మాత్రమే. అయితే సెప్టెంబర్ నెల ప్రారంభంలో అమ్ముడైన కార్లను కలుపుకుంటే లక్ష యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ వెల్లడించింది.

2023 ఆర్ధిక సంవత్సరంలో టైగన్ కారు ఎక్కువగా అమ్ముడైనట్లు (21,736 యూనిట్లు) తెలుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 20,485 యూనిట్ల టైగన్ కార్లను కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. ఎగుమతుల విషయానికి వస్తే.. 2024 ఆర్ధిక సంవత్సరంలో 12,621యూనిట్లు ఎగుమతయ్యాయి.

ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..

టాటా కర్వ్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న.. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ధరలు రూ. 10.90 లక్షల నుంచి రూ. 18.70 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి. ఇది 1.0 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఈ కారు జఫ్రీలో 5 స్టార్ రేటింగ్ పొందింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)