Breaking News

శబరిమలలో నెట్‌వర్క్‌ను పెంచిన వొడాఫోన్‌ ఐడియా

Published on Sun, 11/23/2025 - 10:57

భక్తులకు సౌకర్యార్ధం శబరిమల మార్గంలో కనెక్టివిటీని పెంచే దిశగా తమ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసినట్లు వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. అలాగే, యాత్రకు వచ్చే బాలల సంరక్షణ కోసం వీఐ సురక్షా రిస్ట్‌ బ్యాండ్స్‌ను మరింతగా అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించింది.

శబరిమల యాత్రలో భక్తులు తమ క్షేమ సమాచారాన్ని కుటుంబీకులు, సంబంధీకులతో పంచుకునేలా శబరిమల మార్గంలోని సన్నిధానం, పంపా, నీలక్కల్ అంతటా కనెక్టివిటీని పెంచినట్లు టెల్కో తెలిపింది. ఇందుకోసం వొడాఫోన్‌ ఐడియా ఎల్ 900, ఎల్ 1800, ఎల్ 2100, ఎల్ 2300, ఎల్ 2500తో సహా వివిధ బ్యాండ్లలో 70 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను మోహరించింది. అలాగే పతనంతిట్ట జిల్లాలో 13 కొత్త సెల్‌ టవర్‌లను ఏర్పాటు చేసింది.

యాత్రీకుల భారీ రద్దీలోనూ మెరుగైన డేటా, వాయిస్ సేవలు అందించేలా మాసివ్ మిమో టెక్నాలజీతో అధునాతన ఎఫ్‌డీడీ, టీడీడీ లేయర్లను కూడా మోహరించినట్లు వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. దీంతో గణపతి కోవిల్, నడప్పంతల్, పరిపాలన కార్యాలయాలు, పంపా-సన్నిధానం ట్రెక్కింగ్ మార్గం, నీలక్కల్ పార్కింగ్, బస్టాండ్ వద్ద వొడాఫోన్ ఐడియా ద్వారా కనెక్టివిటీ గణనీయంగా బలోపేతం చేసినట్లు వివరించింది.

ఇక పిల్లల వీఐ సురక్షా రిస్ట్‌ బ్యాండ్స్‌కు సంబంధించి ప్రీ–రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేసినట్లు పేర్కొంది. వీఐసురక్ష పోర్టల్‌తో పాటు కేరళవ్యాప్తంగా 25  వీఐ స్టోర్స్, 103 మినీ స్టోర్స్‌ మొదలైన వాటిల్లో రిజిస్టర్‌ చేసుకుని, పంబాలో ఏర్పాటు చేసిన వీఐ సురక్షా కియోస్క్‌ల నుంచి వీటిని పొందవచ్చని వివరించింది.

Videos

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)