Breaking News

ఒక్క రోజులో.. వొడాఫోన్ ఐడియా పంట పండింది!

Published on Sat, 12/30/2023 - 21:41

టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా పంట పండింది. తక్కువ లాభాలు ఉన్నప్పటికీ, వొడాఫోన్ ఐడియా షేర్ ధరలు ఒక్క రోజులో అమాంతం పెరిగాయి. ఆల్ టైమ్ హైని తాకాయి.  

గత కొన్ని నెలలుగా నీరసమైన లాభాలు ఉన్నప్పటికీ డిసెంబర్ 29న 2023 చివరి మార్కెట్ సెషన్‌లో వోడాఫోన్ ఐడియా షేర్ ధరలు ఏకంగా 20 శాతానికి పైగా ఎగిశాయి. సంవత్సర కాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

వొడాఫోన్ ఐడియా షేర్లు శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో 20 శాతానికి పైగా ఎగిసి రూ.13 నుంచి రూ.16కి చేరాయి.  ఇది కంపెనీ 52 వారాల గరిష్టం. ఇక వొడాఫోన్‌ ఐడియా షేర్ ధరల 52 వారాల కనిష్టం విషయానికి వస్తే రూ. 5.70 వద్ద నమోదైంది.

ఆ డీలే కారణం! 
16.05 కోట్ల షేర్లను విక్రయించి నిధులను సేకరించేందుకు వొడాఫోన్‌ ఐడియా ఇటీవల చేసిన ప్రయత్నాల కారణంగానే షేర్ల ధరలు అకస్మాత్తుగా పెరిగినట్లుగా  తెలుస్తోంది. మొత్తం డీల్ లావాదేవీ విలువ రూ. 233 కోట్లు అని హిందీ వార్తా సంస్థ ఆజ్‌తక్ నివేదించింది. నిధుల సమీకరణ కోసం వొడాఫోన్ ఐడియా గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. అయితే కంపెనీ ఇంకా చాలా బ్యాంకులతో చర్చలు జరుపుతున్నందున పొడిగింపును కోరుతుందని భావిస్తున్నారు. అలాగే భారత్‌లో 5జీ రోల్ అవుట్ కోసం ప్రణాళికను రూపొందిస్తోంది.

2022లో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కు సంబంధించి వొడాఫోన్ ఐడియా ఈ సంవత్సరం ప్రారంభంలో టెలికమ్యూనికేషన్స్ విభాగానికి రూ.1700 కోట్లు చెల్లించింది. ఇది కంపెనీ షేర్‌హోల్డర్‌లలో నమ్మకాన్ని పెంచి, కంపెనీ షేర్ ధరను పెంచింది. 

వాటాదారుల సొమ్ము రెట్టింపు
గత ఆరు నెలల్లో వొడాఫోన్ ఐడియా షేర్ ధరలు 113 శాతం పెరిగాయి. ఇన్వెస్టర్లు, వాటాదారుల డబ్బును రెట్టింపు చేసింది. 2007లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్‌ అయినప్పటి నుంచి వొడాఫోన్‌ ఐడియా షేర్లకు 2023 ఉత్తమ సంవత్సరం.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)