Breaking News

మరో టెలికాం కంపెనీ 5జీ సేవలు షురూ..

Published on Thu, 03/20/2025 - 08:02

దేశీ టెలికం మార్కెట్లో నిలదొక్కుకునే క్రమంలో వొడాఫోన్‌ ఐడియా 5జీ సర్వీసులను ప్రవేశపెట్టింది. ముందుగా ముంబైలో ప్రారంభించి, ఏప్రిల్‌ నాటికి ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, పట్నా, మైసూర్‌ వంటి అయిదు నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జగ్బీర్‌ సింగ్‌ వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో 17 సర్కిల్స్‌లోని 100 నగరాలు/పట్టణాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం ‘పరిచయ ఆఫర్‌’ కింద రూ.299 నుంచి ప్రారంభమయ్యే అన్‌లిమిటెడ్‌ ప్లాన్లతో యాడ్‌–ఆన్‌గా ఈ సేవలు లభిస్తాయి. అయితే, ఈ ఆఫర్‌ ఎంత కాలం ఉంటుందో వెల్లడి కాలేదు. వచ్చే మూడేళ్ల వ్యవధిలో రూ.50,000–55,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలు ఉండగా ఇందులో దాదాపు సగ భాగం 5జీపై, మిగతా మొత్తాన్ని 4జీ కవరేజీ విస్తరణపై వెచ్చించనున్నట్లు సింగ్‌ చెప్పారు. కస్టమర్ల వినియోగాన్ని బట్టి 5జీ నెట్‌వర్క్‌ విస్తరణ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 17 కోట్ల యూజర్లతో రిలయన్స్‌ జియో, 12 కోట్ల మందితో భారతీ ఎయిర్‌టెల్‌  5జీ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నాయి.  

ఇదీ చదవండి: గోల్డ్‌.. నాన్‌ స్టాప్‌ ర్యాలీ

శాట్‌కామ్‌ సంస్థలతో చర్చలు..

ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్, సెల్‌ టవర్లు లాంటి కనెక్టివిటీ సదుపాయాలు లేని ప్రాంతాల్లో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు శాట్‌కామ్‌ సంస్థలతో జట్టు కట్టే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సింగ్‌ చెప్పారు. అయితే, డివైజ్‌ల వ్యయాలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తదితర అంశాలపై ఇంకా కొన్ని సందేహాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాŠండ్‌ ఇంటర్నెట్‌ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టే దిశగా జియో ప్లాట్‌ఫామ్స్, ఎయిర్‌టెల్‌ ఇప్పటికే స్పేస్‌ఎక్స్‌తో జట్టు కట్టిన సంగతి తెలిసిందే. 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)