Breaking News

వొడాఫోన్‌ ఐడియా భారీ కాంట్రాక్టులు

Published on Mon, 09/23/2024 - 04:00

న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) తాజాగా భారీ కాంట్రాక్టులకు తెరతీసింది. 4జీ, 5జీ నెట్‌వర్క్‌ పరికరాల కొనుగోలు కోసం రూ. 30,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చింది. మూడేళ్లలో వీటిని సరఫరా చేసేందుకు దిగ్గజాలు నోకియా, ఎరిక్‌సన్, శామ్‌సంగ్‌లను ఎంపిక చేసుకుంది. వెరసి ఈ ఏడాది భారీ ఆర్డర్లను ఇచ్చిన టెలికం ఆపరేటర్‌గా వొడాఫోన్‌ ఐడియా నిలిచింది. 

మూడేళ్ల కాలంలో 6.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 55,000 కోట్లు) పెట్టుబడులు వెచి్చంచేందుకు కంపెనీ ప్రణాళికలు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా తొలి దశ కింద తాజా కాంట్రాక్టులకు తెరతీసింది. మూడేళ్లలో 4జీ, 5జీ కవరేజీకి వీలుగా నోకియా, ఎరిక్‌సన్, శామ్‌సంగ్‌లు పరికరాలు సరఫరా చేయవలసి ఉంటుందని వొడాఫోన్‌ ఐడియా ప్రకటన పేర్కొంది. 

సరఫరాలు డిసెంబర్‌  క్వార్టర్‌ నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. తద్వారా 4జీ కవరేజీని 1.03 బిలియన్‌ నుంచి 1.2 బిలియన్ల జనాభాకు పెంచడం, కీలక మార్కెట్లలో 5జీ సేవలను ప్రవేశపెట్టడం, డేటా వినియోగానికి అనుగుణంగా సామర్థ్యాన్ని విస్తరించడం చేపట్టనున్నట్లు తెలియజేసింది. తొలుత 4జీ కవరేజీని 120 కోట్ల మందికి చేరువ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. 

వీఐఎల్‌ 2.0కు శ్రీకారం... 
వీఐఎల్‌ 2.0 పేరుతో పెట్టుబడుల ప్రక్రియను ప్రారంభించినట్లు వొడాఫోన్‌ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా తెలియజేశారు.  నోకియా, ఎరిక్‌సన్‌ కంపెనీ ప్రారంభం నుంచి భాగస్వాములుకాగా.. తాజాగా శామ్‌సంగ్‌తో ప్రయా ణం ప్రారంభించడం ప్రోత్సాహకర అంశమని వ్యాఖ్యానించారు. 

2018లో ఐడియా సెల్యులర్‌తో విలీనం అనంతరం వొడాఫోన్‌ ఐడియాగా ఏర్పాటైనప్పుడు 40.8 కోట్లమంది కస్టమర్లతో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా అవతరించింది. అయితే ఆపై జియో, ఎయిర్‌టెల్‌తో ఎదురైన తీవ్ర పోటీలో వెనకబడటంతో ప్రతీ నెలా కస్టమర్ల  సంఖ్య తగ్గుతూ వచి్చంది. ప్రస్తుతం వీఐఎల్‌ వినియోగదారుల సంఖ్య 21.5 కోట్లు. 
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)