Breaking News

డబ్బుఉందా? డెబిట్‌! లేదా? క్రెడిట్‌!

Published on Sat, 02/14/2026 - 00:00

భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ మరో కీలక మలుపు తీసుకుంటోంది. అంతర్జాతీయ చెల్లింపుల దిగ్గజం వీసా  త్వరలో భారత్‌లో ఒకే కార్డుతో అటు డెబిట్‌కి, ఇటు క్రెడిట్‌కి రెండు విధాలుగా ఉపయోగపడేలా  ‘డెబిట్‌–కమ్‌–క్రెడిట్‌ కార్డు’ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త విధానం వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచడమే కాకుండా, దేశంలో క్రెడిట్‌ వినియోగాన్ని విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

యూపీఐ, డెబిట్, క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే 
ప్రస్తుతం భారత్‌లో యూపీఐ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, అది ప్రధానంగా బ్యాంక్‌ సేవింగ్స్‌  ఖాతా నుంచి నేరుగా డబ్బు కట్‌ అయ్యే విధానమే. డెబిట్‌ కార్డులు కూడా ఖాతాలో డబ్బు ఉంటేనే పనిచేస్తాయి. మరోవైపు, క్రెడిట్‌ కార్డులు సౌకర్యవంతమే అయినా వాటి వినియోగం డిజిటల్‌ రూపంలో,యూపీఐ చెల్లింపుల విషయంలో ఇంకా పరిమితంగానే ఉంది. ఈ నేపథ్యంలో వీసా తీసుకొస్తున్న కొత్త కార్డు యూపీఐతో అందే సౌలభ్యం, డెబిట్‌ కార్డుతో చేయగల నియంత్రణ,  క్రెడిట్‌ కార్డు  ఫ్లెక్సిబిలిటీ ఈ మూడింటినీ కలిపిన ఉపయోగకరమైన సాధనంగా  మారనుందని విశ్లేషకులు అంటున్నారు. 

బ్యాంకులు, వినియోగదారులకు లాభాలు 
ఈ కొత్త విధానం ద్వారా బ్యాంకులు తమ రిస్క్‌ పాలసీలకు అనుగుణంగా క్రెడిట్‌ వినియోగాన్ని నియంత్రించగలుగుతాయి. వినియోగదారులకు మాత్రం ఒకటి కంటే ఎక్కువ కార్డులని ప్రతిచోటుకూ మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా స్థిర ఆదాయం ఉన్నా క్రెడిట్‌ కార్డు లేని మధ్య
తరగతి వర్గానికి ఇది ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. 

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం 
నిపుణుల అంచనాల ప్రకారం, ఈ విధానం నగదు వినియోగాన్ని తగ్గించడంలో, టైర్‌–2, టైర్‌–3 నగరాల్లో కార్డు వినియోగాన్ని పెంచడంలో, ఫార్మల్‌ ఎకానమీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే, అతిగా క్రెడిట్‌ వినియోగం వల్ల వినియోగదారుడు అప్పుల  ఊబిలో కూరుకునే ప్రమాదం కూడా ఉందని, అందుకే ప్రజల్లో ఆర్థిక అవగాహన  పెంచాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వీసా ప్రతిపాదిస్తున్న ఈ డెబిట్‌–కమ్‌–క్రెడిట్‌ కార్డు భారత్‌ చెల్లింపుల వ్యవస్థను మరింత స్మార్ట్‌గా, ఫ్లెక్సిబుల్‌గా మార్చే విధానంగా  పరిగణించవచ్చు. ఇది వినియోగదారుల సౌకర్యం, బ్యాంకులకు భద్రత ఈ రెండింటికీ మధ్య సమతుల్యత తీసుకురావచ్చని విశ్లేషకుల అభిప్రాయం.  

కార్డు కాదు కాంబోప్యాక్‌ 
వీసా అభివృద్ధి చేసిన ‘ఫ్లెక్సిబుల్‌ క్రెడెన్షియల్‌ (వీసా ఫ్లెక్స్‌) ’ టెక్నాలజీ ఆధారంగా ఈ కార్డు పనిచేస్తుంది. 16 అంకెల ఒకే  కార్డు నంబర్‌ ద్వారా కస్టమర్‌ లావాదేవీ చేసే సమయంలో అది అవసరాన్ని బట్టి డెబిట్‌గా లేదా క్రెడిట్‌గా వాడుకోవచ్చు. చెల్లింపు ఎలా జరగాలన్నది కస్టమర్‌  కొనుగోలు చేసే విలువ మొత్తం, లేదా వినియోగదారు ముందుగా ఎంచుకున్న సెట్టింగ్స్‌ ఆధారంగా ఆటోమేటిక్‌గా నిర్ణయమవుతుంది.ఉదాహరణకు, రోజువారీ చిన్న ఖర్చులు డెబిట్‌గా, పెద్ద కొనుగోళ్లు క్రెడిట్‌లో జరిగేలా ఈ కార్డును సెట్‌ చేసుకోవచ్చు.

భారత్‌ ఎందుకు కీలక మార్కెట్‌? 
భారత్‌లో క్రెడిట్‌ కార్డు వినియోగం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ. అదే సమయంలో నగదు లావాదేవీల వాటా చాలా పెద్దది. ఈ పరిస్థితిలో ఒకే కార్డు ద్వారా డెబిట్‌–క్రెడిట్‌ సౌకర్యం ఇవ్వడం వల్ల డిజిటల్‌ చెల్లింపులు మరింత విస్తరించవచ్చని వీసా భావిస్తోంది. 

సాక్షి, బిజినెస్‌డెస్క్‌ 

Videos

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)