Breaking News

విజయ్‌ మాల్యా ట్వీట్‌.. గట్టిగా తగులుకున్న నెటిజన్‌లు

Published on Wed, 05/28/2025 - 21:01

బ్యాంకులకు రూ. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ మాల్యాను తాజాగా సోషల్‌మీడియాలో యూజర్లు గట్టిగా తగులుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ (IPL) సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుపై విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్‌కు  విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు.

ఆర్‌సీబీని ప్రశంసిస్తూ ‘ఎక్స్‌’(ట్విటర్‌)లో విజయ్‌ మాల్యా ఓ పోస్ట్‌  పెట్టాడు. అంతే దొరికాడురా అంటూ నెటిజన్‌లు గట్టిగా తగులుకున్నారు. ఆయన చేసిన పోస్టును ట్రోల్ చేస్తూ చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు భారత్‌కు తిరిగి రావాలని కోరారు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఇండియా రావచ్చుగా..  అని ఒకరు ట్వీట్ చేయగా భారత్‌లో ప్లేఆఫ్స్ చూడటానికి రండి.. అంటూ మరొకరు ట్వీట్ చేశారు. 'కమ్ బ్యాక్ టు ఇండియా మ్యాన్'.. "ఎప్పుడు వస్తున్నావు?"..  ఇలా  మరికొందరు కామెంట్లు చేశారు.

ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ గా పేరొందిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంతో దివాలా తీశాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం ఎస్‌బీఐ నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియంకు రూ .9,000 కోట్లకు పైగా ఎగ్గొట్టి ఆర్థిక మోసం, మనీలాండరింగ్ ఆరోపణల మధ్య 2016లో దేశం నుండి పారిపోయాడు. ప్రస్తుతం యూకేలో ఉంటున్న మాల్యా.. దివాలా, భారత్ కు అప్పగింతపై న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)