Breaking News

పాన్‌ కార్డు అలాగే వాడుతున్నారా? కట్టండి రూ.10వేలు!!

Published on Sun, 06/15/2025 - 13:13

పాన్ కార్డు, ఆధార్ లేకుండా నేటి కాలంలో ఆర్థికపరమైన ఏ పనినీ పూర్తి చేయడం సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాన్, ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పటికీ చాలా మంది తమ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోలేదు. అలాంటి వారి పాన్ కార్డులు ఇనాక్టియావ్‌గా మారాయి. అయినప్పటికీ కొందరు ఆర్థిక లావాదేవీల్లో ఇనాక్టివ్ పాన్ కార్డులను అలాగే ఉపయోగిస్తున్నారు.

ఇలాంటి వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ కింద ఒక్కో లావాదేవీపై రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎవరైనా ఆర్థిక లావాదేవీల్లో ముఖ్యంగా అధిక విలువ కలిగిన లావాదేవీలలో ఇనాక్టివ్‌ పాన్‌ ఉపయోగిస్తే ప్రతి సందర్భంలో ప్రత్యేక జరిమానా విధించవచ్చని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. బ్యాంకు ఖాతా తెరవడం లేదా నిర్వహించడం, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం, ఆస్తిని కొనుగోలు చేయడం, రుణం కోసం దరఖాస్తు చేయడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం వంటి లావాదేవీలు ఇందులో ఉన్నాయి.

👉 ఆధార్‌ అప్‌డేట్‌కు కొత్త డెడ్‌లైన్‌

రెండు పాన్ కార్డులున్నా తప్పే..
ఒక వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. ఇలాంటి వారు రెండింటిలో ఒక పాన్ కార్డును సరెండర్ చేయాలి. అలా చేయకుండా పట్టుబడితే ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల కొంతమందికి రెండు పాన్‌ కార్డులు ఉండవచ్చు. ఉదాహరణకు పాన్ కార్డు వివరాల్లో తప్పులున్నప్పుడు, పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్పు కోసం కొత్త పాన్ కార్డు తీసుకొని ఉండవచ్చు. ఇలా రెండు పాన్‌ కార్డులు కలిగి ఉంటే ఎలాంటి జరిమానా విధించకుండా వదిలేస్తారు. అదే ఉద్దేశపూర్వకంగా రెండు పాన్‌కార్డులు పెట్టుకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవు. కాబట్టి ఎవరి దగ్గరైనా రెండు పాన్ కార్డులు ఉంటే వెంటనే సరెండర్‌ చేయడం మంచిది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)