Breaking News

13 బిలియన్‌ డాలర్ల దీపావళి పండుగ..చిన్న సంస్థలకు మరింత లాభసాటిగా

Published on Sat, 10/14/2023 - 11:10

ముంబై: దేశీ చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ఈసారి దీపావళి పండుగ మరింత లాభసాటిగా ఉండనుంది. ఈ–కామర్స్‌ ద్వారా 13 బిలియన్‌ డాలర్ల మేర వ్యాపారాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాల్లోని ఎంఎస్‌ఎంఈలు మరింత ఎక్కువగా ఆర్డర్లు దక్కించుకుంటున్నాయి.

టెక్‌ ఆధారిత లాజిస్టిక్స్‌ సంస్థ షిప్‌రాకెట్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొత్తం ఆర్డర్లలో 10–15 శాతం ఆర్డర్లు తొలిసారిగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారి నుంచే ఉండనున్నాయి. పండుగ అమ్మకాల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్‌ (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌) 28 శాతం వాటాతో అగ్రస్థానంలో, 13 శాతం వాటాతో ముంబై, 7 శాతం వాటాతో బెంగళూరు ఆ తర్వాత స్థానాల్లో ఉంటాయి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ లావాదేవీలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ వినియోగం పెరిగింది. షిప్‌రాకెట్‌కి వచ్చే ఆర్డర్లలో 56 శాతం వాటా మెట్రోయేతర నగరాల నుంచే ఉంటోంది.  

ఎగుమతులు అప్‌.. 
పండుగ సీజన్‌లో ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువగా కృత్రిమ జ్యుయలరీ, సౌందర్య సంరక్షణ, దుస్తులు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, పుస్తకాలు, ఆటోమోటివ్‌ విడిభాగాలు, హోమ్‌ ఫర్నిషింగ్స్‌ మొదలైనవి వీటిలో ఉంటున్నాయి. అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, యూఏఈలో డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. పండుగ సీజన్‌ సందర్భంగా డిమాండ్‌ పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ అదనంగా మూడు గిడ్డంగులను సమకూర్చుకుంది. ఆర్డర్లను సత్వరం ప్రాసెస్‌ చేసేందుకు సిబ్బంది సంఖ్యను 50 శాతం మేర పెంచుకుంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)