Breaking News

ఎంఎస్‌ఎంఈ రుణాలకు టారిఫ్‌ల దెబ్బ 

Published on Fri, 10/24/2025 - 05:31

ముంబై: బ్యాంకింగ్‌ వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) రుణాల పోర్ట్‌ఫోలియోలో మొండిబాకీల (ఎన్‌పీఏ) పరిమాణం ఈ ఆరి్థక సంవత్సరం ఆఖరు నాటికి ఒక మోస్తరుగా పెరగనుంది. గత ఆరి్థక ఆఖరులో 3.59 శాతంగా ఉండగా, ఈసారి 3.7–3.9 శాతానికి పెరిగే అవకాశం ఉంది. భారత ఎగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించడం ఇందుకు కారణం కానుంది. క్రిసిల్‌ రేటింగ్స్‌ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

టెక్స్‌టైల్స్, గార్మెంట్స్‌..కార్పెట్స్, రత్నాభరణాలు, రొయ్యలు తదితర ఎగుమతుల ఆధారిత ఎంఎస్‌ఎంఈలపై టారిఫ్‌ల ప్రభావం ఉంటుందని సంస్థ డైరెక్టర్‌ శుభ శ్రీ నారాయణన్‌ తెలిపారు. ఆరి్థక వృద్ధికి ఊతమిచ్చేందుకు చిన్న వ్యాపారాలకు మరింతగా రుణాలివ్వాలంటూ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో దీనివల్ల రిసు్కలు కూడా ఉంటాయని గుర్తించాలని నివేదిక సూచించింది. గతంలో కూడా ఎంఎస్‌ఎంఈలు వేగంగా వృద్ధి చెందినప్పుడు, కొన్నాళ్ల తర్వాత ఎన్‌పీఏలు భారీగా పెరిగాయని పేర్కొంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎంఎస్‌ఎంఈల రుణాలు సుమారు 17 శాతంగా, కార్పొరేట్‌ రుణాలు 38 శాతంగా ఉంటాయి. రిటైల్‌ లోన్‌లకు సంబంధించి అన్‌సెక్యూర్డ్‌ విభాగంలోనూ రుణ నాణ్యతపై ఓ కన్నేసి ఉంచాల్సి వస్తుందని తెలిపింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)