Breaking News

500 సార్లు అప్లై చేసినా రాని ఉద్యోగం!: చివరికి ఏం చేసిందంటే?

Published on Thu, 12/11/2025 - 21:07

చదువు పూర్తయిన తరువాత.. ఎవరైనా ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిందే. జాబ్ కోసం చాలా కంపెనీలకు అప్లై చేసుకుంటారు. ఇంటర్వ్యూలకు సైతం హాజరవుతారు. ఎవరైనా 500 కంటే ఎక్కువ ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటారా?, వినడానికి బహుశా ఇది కొంచెం కొత్తగా అనిపించినా.. ఇది నిజం. ఇక కథనంలోకి వెళ్తే..

చికాగోకు చెందిన ఒక మహిళ ఉర్బానా ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన కొద్దికాలానికే ఉద్యోగాల కోసం అప్లై చేయడం మొదలుపెట్టింది. ఆలా దాదాపు రెండేళ్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంది.

దాదాపు 800 రోజులు.. ఆమె 500 కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంది. కానీ రెస్పాన్స్ మాత్రం అంతంత మాత్రమే వచ్చాయి. ఉద్యోగాలను వెతుక్కునే సమయంలో.. ఆమె తన భర్త ఆదాయంపై ఆధారపడింది. 2025 జులైలో నిరాశ చెంది.. ప్లీజ్ హైర్ మీ అనే ఫొటోలతో పాటు.. వ్యక్తిగత వివరాలను కలిగి ఉన్న ఒక 'గ్రాఫిక్ ఫోటో'ను ఫేస్‌బుక్‌లోని ఒక పెద్ద చికాగో కమ్యూనిటీ గ్రూప్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ అతి తక్కువ కాలంలోనే వైరల్ కావడంతో.. చాలామంది జాబ్ ఆఫర్ కూడా ఇచ్చారు.

వచ్చిన జాబ్ ఆఫర్లతో ఒక ఫోటోగ్రఫీ స్టూడియో యజమాని కూడా ఉన్నారు, ఆమె కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రశంసించారు. ఆమెను పార్ట్-టైమ్ స్టూడియో మేనేజర్‌గా నియమించారు. ఈ ఉద్యోగం తన డిగ్రీకి సంబంధించినది కానప్పటికీ, ఆమె సంతృప్తి చెందిందని & సహాయక పని వాతావరణాన్ని విలువైనదిగా చెబుతుంది.

ఇదీ చదవండి: వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..

#

Tags : 1

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)