Breaking News

టారిఫ్‌లు ఆర్నెల్లు మించి ఉండవు..

Published on Thu, 08/14/2025 - 06:41

ముంబై: అమెరికా టారిఫ్‌లకు సంబంధించి సవాళ్లు వచ్చే ఒకటి రెండు త్రైమాసికాల్లో సమసిపోతాయని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్‌ అంచనా వేశారు. దేశం దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రైవేటు రంగం మరింత ప్రముఖ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. 2023–24లో జీడీపీ వృద్ధి 9.2 శాతం నుంచి 2024–25లో 6.5 శాతానికి తగ్గిపోవడానికి కఠిన రుణ పరిస్థితులు, లిక్విడిటీ అంశాలను కారణాలుగా పేర్కొన్నారు. 

సరైన వ్యవసాయ విధానాలను అమలు చేస్తే నిజమైన జీడీపీ వృద్ధికి 25 శాతం అదనపు తోడ్పాటునిస్తాయన్నారు. రత్నాభరణాలు, రొయ్యలు, టెక్స్‌టైల్స్‌ రంగాలపై  అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ, వీటిని ఎదుర్కోవడం కష్టమన్నారు. ప్రభావిత రంగాలతో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. దీనిపై ప్రభుత్వం నుంచి చర్యలు ఉంటాయంటూ, కొంత ఓపిక పట్టాలని కోరారు. 

అమెరికా వాణిజ్య బృందం ఈ నెల చివర్లో భారత్‌కు చర్చలకు రానున్న నేపథ్యంలో.. అలాస్కాలో యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య జరిగే సమావేశం ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు. టారిఫ్‌ సంబంధిత అంశాలపై దృష్టి పెడుతూ.. అదే సమయంలో ముఖ్యమైన సవాళ్లను విస్మరించరాదన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా పడే ప్రభావం, కీలక ఖనిజాల కోసం ఒకే దేశంపై ఆధారపడడం వంటి సవాళ్లను ప్రస్తావించారు. రానున్న సంవత్సరాల్లో పెద్ద ఎత్తున వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో, ప్రైవేటు రంగం సైతం దీర్ఘకాల దృష్టితోనే ఆలోచించాలని సూచించారు.  

విధానపరమైన మద్దతు 
పరిశోధనల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని, తమ వంతు పెట్టుబడులు పెంచాల్సిన బాధ్యత ప్రైవేటు రంగంపై ఉన్నట్టు సీఈఏ అనంత నాగేశ్వరన్‌ చెప్పారు. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. దేశీయంగా వినియోగం బలంగా ఉన్నట్టు చెప్పారు. చైనాతో 100 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటును ప్రస్తావిస్తూ.. దిగుమతులను మరిన్ని దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషించాలని కోరారు.  

 

Videos

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు