Breaking News

భారత్‌ మేథోశక్తిని అమెరికా గుర్తించింది

Published on Thu, 08/17/2023 - 07:54

న్యూఢిల్లీ: భారత్‌కు ఉన్న అపారమైన మేధో మూలధనాన్ని అమెరికా గుర్తిచిందని ఇండస్‌ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఐఐఆర్‌ఎఫ్‌) వ్యవస్థాపకుడు గురుప్రసాద్‌ సౌలే తెలిపారు. సెమీ కండక్టర్‌ తదితర కీలక రంగాల్లో భారత్‌తో అనుసంధానం కోసం ముందుకు రావడం కీలక పరిణామమన్నారు. భారత్‌ను కేవలం సేవల కేంద్రంగా అమెరికా ఇంక ఎంతమాత్రం చూడడం లేదన్నారు.

ఈ విషయమై అగ్రరాజ్య ధోరణలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో గురుప్రసాద్‌ సమావేశం కావడం గమనార్హం. ‘‘అమెరికా నుంచి సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు బదిలీ అవ్వడం నిదానంగా జరుగుతుంది. కొన్ని టెక్నాలజీలను భారత్‌తో పంచుకునేందుకు అమెరికా నిజంగా సిద్ధంగా లేదు.

కానీ ప్రధాని మోదీ పర్యటన తర్వాత భారత్‌లో తయారీ విషయమై చెప్పుకోతగ్గ మార్పు అమెరికాలో వచ్చింది’’అని గరుప్రసాద్‌ వివరించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్, హెల్త్‌కేర్, ఏఐ రంగాల్లో భారత్‌ మరింత పురోగమిస్తుందని అమెరికా భావిస్తున్నట్టు చెప్పారు. అమెరికాలో భారత స్టార్టప్‌లకు అపార అవకాశాలున్నాయంటూ.. చాలా స్టార్టప్‌లకు నాస్‌డాక్‌లో లిస్ట్‌ అయ్యేందుకు ఆదాయం అవసరం లేదన్న విషయం తెలియదన్నారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)