Breaking News

అమెరికా ఆదేశాలు.. ఏఐపై ఆంక్షలు!

Published on Sat, 06/20/2026 - 18:37

సాంకేతికాభివృద్ధిలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్‌ సభ్యుడు అభయ్‌ కరందికర్‌ వ్యక్తం చేశారు. అమెరికా సర్కారు ఆదేశాలతో ఆంథ్రోపిక్‌ సంస్థ సంచలనాత్మక అత్యాధునిక ఏఐ మోడళ్ల యాక్సెస్‌ను ఇతర దేశాల వారికి నిలిపివేసిన సందర్భంలో ఆయన ఈ సూచన చేశారు.

ఆంథ్రోపిక్‌ సంస్థకు చెందిన ఏఐ మోడళ్లు ఫ్యాబిల్‌ 5, మైథోస్‌ 5ను అమెరికాయేతర సంస్థలు, వ్యక్తులు పొందకుండా ట్రంప్‌ సర్కారు అసాధారణ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఫ్యాబిల్‌ను గత వారమే ఆంథ్రోపిక్‌ విడుదల చేయడం గమనార్హం. ‘‘స్థానిక ఏఐ సదుపాయాలు, హార్డ్‌వేర్‌ అభివృద్ధిలో భారత్‌ వెనుకబడి ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర సెమీకండక్టర్‌ చిప్‌లు లేదా ప్లాట్‌ఫామ్‌ల్లేవు.

అమెరికా ప్రభుత్వం సరికొత్త ఎగుమతి నియంత్రణల ఆదేశాల నేపథ్యంలో టెక్నాలజీ అభివృద్ధిలో భారత్‌ స్వావలంబన సాధించాలి’’అని కరందికర్‌ పేర్కొన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో ఏఐ అప్లికేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పౌర సేవల్లో ఏఐ అమలు దిశగా నీతి ఆయోగ్‌ కృషి సాగిస్తుందన్నారు. డిజిటల్‌ ప్రజా సదుపాయాల అభివృద్ధిలో భారత్‌ ముందున్నట్టు చెప్పారు. ఫౌండేషన్‌ ఏఐ మోడళ్ల అభివృద్ధి కోసం 12 స్టార్టప్‌లకు ప్రభుత్వం సాయమందించినట్టు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)