Breaking News

యూఎస్‌లో శ్రామిక కొరతను అందిపుచ్చుకునేలా..

Published on Tue, 09/16/2025 - 11:06

ఐటీ జాబ్స్‌ కాకుండా విదేశీయుల కోసం యూఎస్‌లో చాలానే ఉద్యోగాలు ఉన్నాయి. యూఎస్‌లో పెరుగుతున్న శ్రామిక కొరత దృష్ట్యా భారత యువతకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో.. వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో తెలుసుకుందాం. ఐటీ కాకుండా అమెరికాలో ప్రస్తుతం నర్సింగ్, హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ), స్కిల్డ్ ట్రేడ్‌ ఉద్యోగాలు (వెల్డింగ్, ఎలక్ట్రీషియన్ వంటివి), వ్యవసాయ రంగాల్లో భారతీయ యువతకు అవకాశాలు ఉన్నాయి.

కొన్ని సంస్థల సర్వేల ప్రకారం.. భారతదేశంలో 18-40 సంవత్సరాల వయసు గల జనాభా 60 కోట్ల మంది ఉన్నారు. సగటు వయసు 30 ఏళ్లలోపు ఉంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న భారతీయ కార్మికులు ప్రతి సంవత్సరం 130 బిలియన్ డాలర్లు స్వదేశానికి పంపుతున్నారు. మెరుగైన వ్యవస్థలతో ఇది 2030 నాటికి సంవత్సరానికి 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి టాలెంట్ హబ్‌గా ఎదగడానికి భారత్‌కు అవకాశం ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన యూఎస్‌ వంటి దేశాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతోంది. అందుకు తగినట్లుగా యువ జనాభా అంతంతమాత్రంగానే ఉంది. ఈ వ్యత్యాసాన్ని భారత్‌ భర్తీ చేస్తుంది.

యూఎస్‌లో ఐటీయేతర ఉద్యోగ అవకాశాలు

నర్సింగ్, ఆరోగ్య సంరక్షణ: అమెరికాలో ఆరోగ్య సంరక్షణ రంగంలో నర్సులకు, ఇతర ఆరోగ్య నిపుణులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ): హోటల్ నిర్వహణ, క్యాటరింగ్ వంటి హాస్పిటాలిటీ రంగాల్లో కూడా భారతీయ యువతకు అవకాశాలు లభిస్తాయి.

నైపుణ్యం కలిగిన ట్రేడ్‌ ఉద్యోగాలు: వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, గ​ృహ నిర్మాణ కార్మికులు.. వంటి నైపుణ్యం కలిగిన ట్రేడ్‌ల్లో కూడా అమెరికాలో కొరత ఉంది. దీనికి తగిన శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు దొరుకుతాయి.

వ్యవసాయం: అమెరికా వ్యవసాయ రంగంలో కూడా వివిధ రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం అమెరికా వీసా విధానాలు కఠినతరం కావడంతో ముఖ్యంగా హెచ్‌-1బీ వీసా వంటి వాటికి ఎంతో పోటీ ఉంది. భారత యువత వీటిని అందిపుచ్చుకోవడానికి సంబంధిత రంగాల్లో నైపుణ్యం పెంచుకోవాలి. విద్యార్హతలు సంపాదించాలి. అమెరికా వీసా నిబంధనలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా దరఖాస్తు ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

వీసా విధానాలు

వీసా పేరుఉపయోగం / లక్ష్యం
H‑2Aవ్యవసాయ రంగంలో సీజనల్ వర్కర్ల కోసం ఈ వీసా పని చేస్తుంది.
H‑2Bవ్యవసాయేతర సీజనల్ / తాత్కాలిక ఉద్యోగాలు (హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, పార్క్స్, రిసోర్ట్స్ మొదలైనవి)
L‑1కంపెనీ ఇంటర్నల్‌ ట్రాన్స్‌ఫర్‌, మేనేజ్‌మెంట్‌, ఎగ్జిక్యూటివ్ లేదా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వర్కర్లు
O‑1అత్యుత్తమ ప్రతిభ (ఆర్ట్స్‌, అథ్లెటిక్స్‌, బిజినెస్‌, ఎడ్యుకేషన్‌, సైన్సెస్‌) ఉన్నవారికీ

 

ఇదీ చదవండి: సెస్‌ల లక్ష్యం నీరుగారుతోందా?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)