ఇదీ అమెరికాలో ఉద్యోగాల పరిస్థితి!

Published on Wed, 11/04/2026 - 06:53

అమెరికా జాబ్ మార్కెట్‌లో.. సెప్టెంబర్ నెలలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకవైపు కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతుంటే.. మరోవైపు ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ ఉద్యోగాలను వదిలి వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ విషయాన్ని అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్(BLS) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

ఉద్యోగ అవకాశాలు
ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే.. సెప్టెంబర్‌లో అమెరికాలో మొత్తం 7.52 మిలియన్ల ఉద్యోగ ఖాళీలు నమోదైనట్లు నివేదిక చెబుతోంది. ఆగస్టులో ఈ సంఖ్య 7.19 మిలియన్లుగా ఉంది. అంటే.. ఒక్క నెలలోనే 3.33 లక్షల ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఉద్యోగ అవకాశాల రేటు కూడా 4.3 శాతం నుంచి 4.5 శాతానికి చేరుకుంది. అయితే, ఈ పెరుగుదల ఉన్నప్పటికీ ఉద్యోగ మార్కెట్‌లో పెద్దగా మార్పు కనిపించలేదని బీఎల్ఎస్ పేర్కొంది.

ఈ రంగంలోనే ఎక్కువ
కొత్త ఉద్యోగ నియామకాలు కూడా కొంత పెరిగాయి. సెప్టెంబర్‌లో సుమారు 54.02 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. ఆగస్టులో ఈ సంఖ్య 52.71 లక్షలుగా ఉంది. ముఖ్యంగా.. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార సేవల రంగంలో కొత్త నియామకాలు ఎక్కువగా జరిగినట్లు సమాచారం. ఈ ఒక్క రంగంలోనే 1.58 లక్షల నియామకాలు పెరిగాయి. దీన్ని బట్టి చూస్తే.. ఈ రంగంలో ఉద్యోగుల అవసరం పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగ రాజీనామాలు
ఉద్యోగ రాజీనామాల విషయానికి వస్తే.. సెప్టెంబర్‌లో సుమారు 33.65 లక్షల మంది తమంతట తాముగా ఉద్యోగాలను వదిలేశారు. ఆగస్టులో ఈ సంఖ్య 30.44 లక్షలుగా ఉంది. అంటే.. ఒక్క నెలలోనే మరో 3.21 లక్షల మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారన్నమాట. సాధారణంగా ఉద్యోగులు తమకు మెరుగైన జీతం, మంచి ఉద్యోగం లేదా కెరీర్‌లో ఎదుగుదలకు అవకాశం లభిస్తుందని భావించినప్పుడు ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలి కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే.. రాజీనామాలు పెరగడానికి కారణాలు ఏమిటనేది స్పష్టంగా వెల్లడికాలేదు.

కంపెనీలు ఇలా..
అయితే.. కంపెనీలు ఉద్యోగులను తొలగించే సంఖ్య మాత్రం తగ్గినట్లు నివేదిక చెబుతోంది. సెప్టెంబర్‌లో సుమారు 16.41 లక్షల మంది ఉద్యోగులు తొలగింపులకు గురయ్యారు. ఆగస్టులో ఈ సంఖ్య 17.68 లక్షలుగా ఉంది. దీన్నిబట్టి చూస్తే.. ఉద్యోగుల తొలగింపులు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా.. ఆరోగ్య సంరక్షణ, సామాజిక సేవల రంగంలో తొలగింపులు 70 వేల మేర తగ్గడం గమనార్హం.

మొత్తం మీద.. ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఉద్యోగులు కొత్త అవకాశాల కోసం ప్రస్తుత ఉద్యోగాలను వదులుకుంటున్నారు. కంపెనీలు మాత్రం భారీగా ఉద్యోగులను తొలగించే పరిస్థితిలో లేవు. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఫెడరల్ రిజర్వ్ తీసుకునే తదుపరి నిర్ణయాలకు కీలకంగా మారనున్నాయి.

ఇదీ చదవండి: కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తే గంటకు రూ.1,900 జీతం!

Videos

524 ఓట్ల మెజారిటీ ఏమైంది? డోన్ లో కౌంటింగ్ డ్రామా!

మల్లారెడ్డికి హైడ్రా షాక్.. ఫోమ్ హౌస్ పై బుల్డోజర్..!

రిపబ్లికన్లకు బిగ్ షాక్! అమెరికా మధ్యంతర ఎన్నికల కౌంటింగ్ పై ఉత్కంఠ

దక్షిణ కోస్తా కొట్టుకుపోయేలా.. ముంచెత్తిన మురసు తుఫాన్

ఆధిక్యంలో YSRCP.. కౌంటింగ్ కు బ్రేక్.. నంద్యాలలో టీడీపీ హైడ్రామా

ఇది ఒక గెలుపేనా..? AI టెక్నాలజీతో దొంగ ఓట్లు.. ఇలా గెలవడానికి సిగ్గులేదా చంద్రబాబు...

అదరగొట్టిన YSRCP.. అనంతపురం, నందికొట్కూరు మున్సిపాలిటీల్లో విజయదుందుభి

ఇవేం చిల్లర చేష్టలురా సామీ..! మేము గెలిస్తే ఓర్చుకోలేకపోతున్నారా...

మాలో మరింత కసి పెంచిన చంద్రబాబుకు థ్యాంక్స్..

భారత్ Vs న్యూజిలాండ్ వన్డే సిరీస్ స్టార్ట్..

Photos

+5

ముంబై : ‘రామాయణ’ ప్రీమియర్ షో...బాలీవుడ్‌ తారలు సందడి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలిడేస్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫోటోలు)

+5

తెలంగాణ : సిరిసిల్ల జిల్లాలో జానపదాల సింగిడి (ఫోటోలు)

+5

విజయవాడలో దంచికొట్టిన వర్షం.. రహదారులు జలమయం (ఫోటోలు)

+5

'మురసు' విధ్వంసం...ఒంగోలులో అల్లకల్లోలం (ఫోటోలు)

+5

చీరలో మెరిసిపోతున్న రకుల్‌ (ఫొటోలు)

+5

నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

ఈ నగరానికి ఏమైంది 2 సినిమా ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)

+5

ప్రత్యేక పూజల్లో నయనతార (ఫోటోలు)

+5

లండన్‌లో ‘రామాయణ’ ప్రమోషన్స్‌ (ఫోటోలు)