H-1B visas: టీసీఎస్‌వే ఎక్కువ..

Published on Sat, 09/20/2025 - 17:09

అమెరికాలో అత్యధిక నైపుణ్యమున్న విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్ -1బీ వీసాలకు సంబంధించి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025లో రెండవ అతిపెద్ద గ్రహీతగా అవతరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,500కి పైగా ఆమోదాలతో అమెజాన్ (10,044) తర్వాత స్థానంలో నిలిచింది.

2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ తర్వాత అత్యధిక హెచ్‌ 1బీ వీసా అప్రూవల్స్‌ పొందిన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), ఆపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951) ఉన్నాయి.

అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులను గణనీయంగా ప్రభావితం చేసే చర్యను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్నారు. వార్షిక హెచ్ -1 బి వీసా ఫీజు 100,000 డాలర్లకు పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

2025 సెప్టెంబర్ 21 తర్వాత దాఖలు చేసిన పిటిషన్లకు ఈ పరిమితి వర్తిస్తుంది. పొడిగించకపోతే 12 నెలల తర్వాత ముగుస్తుంది. "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు హెచ్‌-1బీ వ్యవస్థను దుర్వినియోగం చేశాయి. కంప్యూటర్ సంబంధిత రంగాలలో అమెరికన్ ఉద్యోగులకు గణనీయంగా హాని కలిగిస్తున్నాయి" అని పేర్కొంటూ ఐటీ అవుట్ సోర్సింగ్ కంపెనీలు హెచ్‌-1బీ ఆమోదాలపై ఎంతలా ఆధిపత్యం చెలాయించాయో ప్రభుత్వ ప్రకటన హైలైట్ చేసింది.

#

Tags : 1

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)