Breaking News

ఫెడ్‌ వడ్డీరేట్లు యథాతథం.. రాజకీయ ఒత్తిడి ఉందా?

Published on Thu, 10/29/2026 - 08:41

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిశితంగా పరిశీలిస్తున్న అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల విషయంలో ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంబించింది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్ కమిటీ (ఎప్‌ఓఎంసీ) తాజా సమావేశంలో కీలకమైన ఫెడరల్ ఫండ్స్ వడ్డీ రేట్లను 3.75 శాతం నుంచి 4 శాతం శ్రేణిలోనే యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఫెడ్‌ చైర్మన్ కెవిన్ వార్ష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం గ్లోబల్ మార్కెట్లలో ఆసక్తిని రేకెత్తించింది. కొంతకాలంగా దేశంలో ద్రవ్యోల్బణం ఫెడ్‌ నిర్దేశిత 2 శాతం లక్ష్యం కంటే ఎగువనే కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని ఆర్థికాంశాలను బేరీజు వేసుకున్న తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

నిర్ణయం వెనుక అసలు కారణాలు

ఫెడరల్ రిజర్వ్‌ తీసుకున్న ఈ యథాతథ తీర్మానం వెనుక సుదీర్ఘమైన అంతర్గత చర్చలు జరిగాయని కెవిన్ వార్ష్ తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి వేగం బలంగానే ఉందని, ముఖ్యంగా ఏఐ రంగంలో జరుగుతున్న భారీ పెట్టుబడులు ఆర్థిక కార్యకలాపాలను పరుగులు పెట్టిస్తున్నాయని పేర్కొన్నారు. దేశీయ వ్యయాలు స్థిరంగా ఉండటం, ఉత్పాదకత పెరగడం, లేబర్‌ మార్కెట్ పటిష్టంగా ఉండటం వంటి సానుకూల అంశాలు ఫెడ్‌కు వెన్నుదన్నుగా నిలిచాయి.

అయినప్పటికీ, గత ఐదేళ్లకు పైగా ద్రవ్యోల్బణం ఫెడ్‌ ఆశించిన లక్ష్యం కంటే ఎగువనే కదలాడుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ‘అమెరికా ప్రజలు ఇప్పటికీ అధిక ద్రవ్యోల్బణ భారాన్ని ఎదుర్కొంటున్నారు. దీన్ని కట్టడి చేసి ధరల స్థిరత్వాన్ని తీసుకురావడమే మా ప్రథమ కర్తవ్యం’ అని వార్ష్ చెప్పారు. అయితే, ఈ సమావేశంలో రేట్లు పెంచాలనే ప్రతిపాదనపై కమిటీలో పూర్తిగా ఏకాభిప్రాయం కుదరలేదు. క్లీవ్‌ల్యాండ్ ఫెడ్ ప్రెసిడెంట్ బెత్ హామాక్, బోర్డు గవర్నర్ లీసా కుక్ మాత్రం పావు శాతం (25 పాయింట్లు) వడ్డీ రేటు పెంపు ఉండాలంటూ తమ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు

అమెరికాలో రానున్న మధ్యకాలిక ఎన్నికల నేపథ్యంలో ఫెడ్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న వదంతులను కెవిన్ వార్ష్ ఖండించారు. వడ్డీ రేట్ల నిర్ణయ ప్రక్రియలో రాజకీయాలకు ఎటువంటి తావులేదని స్పష్టం చేశారు. కమిటీ సమావేశంలో తాము కేవలం ఆర్థిక అంశాలు, దేశ ప్రయోజనాల గురించే చర్చించామని, ఎన్నికల ప్రస్తావనే రాలేదని స్పష్టం చేశారు.

భవిష్యత్ వ్యూహం

ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పటికీ వాటిని పూర్తిగా కఠినమైనవిగా అభివర్ణించేందుకు వార్ష్ నిరాకరించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టిడి చేయడం కేవలం ఒక నిర్దిష్ట తేదీకో, క్యాలెండర్ గడువుకో ముడిపడి లేదని, అది ఒక నిరంతర ప్రక్రియ అన్నారు. భవిష్యత్‌లో ద్రవ్య విధాన రూపకల్పనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఫెడ్‌ రాబోయే కాలంలో ప్రత్యేక వ్యూహాత్మక సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్‌కు విద్యుత్‌ నిలిపివేత!

Videos

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

మంత్రి ఇలాకాలో టీడీపీ దౌర్జన్యం.. ఏడాదైనా మహిళకు దక్కని న్యాయం

అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ సెటైర్... సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)