Breaking News

అమెరికా ఎంబసీ షాక్‌.. భారత్‌లో 2 వేల వీసా దరఖాస్తులు రద్దు

Published on Thu, 03/27/2025 - 21:12

భారత్‌లోని యూఎస్ ఎంబసీ ఇటీవల వేల సంఖ్యలో వీసా దరఖాస్తులను రద్దు చేసింది. మోసపూరిత కార్యకలాపాలను నిరోధించే చర్యల్లో సుమారు 2,000 వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి  అమెరికా కొత్త ప్రభుత్వం కఠినమైన ఇమ్మిగ్రేషన్, వీసా విధానాన్ని చేపట్టింది. 

కారణం ఇదే.. 
వీసా అపాయింట్‌మెంట్ల షెడ్యూలింగ్‌లో అవకతవకలపై యూస్‌ ఎంబసీ దృష్టి పెట్టింది. అందులో భాగంగా "బ్యాడ్ యాక్టర్స్" (అక్రమార్కలు) లేదా బాట్స్ (మెషీన్లు) ద్వారా అపాయింట్మెంట్ సిస్టమ్‌లో జరుగుతున్న ఉల్లంఘనల గుర్తించిన రాయబార కార్యాలయం ఆయా ఖాతాలను సస్పెండ్ చేసింది. ఇలా చేసిన సుమారు 2,000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది. తమ షెడ్యూలింగ్ విధానాలను ఉల్లంఘించే ఏజెంట్లు, ఫిక్సర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తామని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది. తక్షణమే ఈ నియామకాలను రద్దు చేస్తున్నామని, అనుబంధ ఖాతాల షెడ్యూలింగ్ అధికారాలను నిలిపివేస్తున్నామని పేర్కొంది.

భారతీయులే ఎక్కువ
విద్య, ఉద్యోగం, పర్యాటకం.. ఇలా వివిధ పనుల కోసం యునైటెడ్ స్టేట్స్ లోకి ప్రవేశించే అతి ఎక్కువ మందిలో భారతీయులు ప్రముఖంగా ఉంటున్నారు.  భారత్ లో అమెరికా వీసా దరఖాస్తులు గణనీయంగా బ్యాక్ లాగ్ లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా బీ1, బీ2 దరఖాస్తుదారుల్లో జాప్యం ఎక్కువ ఉంటోంది. ఈ వీసాలు వ్యాపారం, పర్యాటకం కోసం ఉద్దేశించినవి. 2022-23లో దరఖాస్తు చేసుకున్నవారు 800 నుంచి 1000 రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చింది.

ఇలాంటి సుదీర్ఘ నిరీక్షణ సమయాన్ని ఎదుర్కోవడానికి, జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో భారతీయ దరఖాస్తుదారులకు అమెరికా వీసా అపాయింట్‌మెంట్లను తెరిచింది. వీసా వెయిటింగ్ టైమ్ గురించి భారత ప్రభుత్వం ఎప్పకప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. 2022లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో  వీసా జాప్యంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అప్పటి బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఇటీవల జనవరిలో వాషింగ్టన్ వెళ్లిన జైశంకర్ కొత్త విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)