Breaking News

అక్కడ మూతపడుతున్న బ్యాంకులు.. ఒక్క నెలలోనే 139 బ్రాంచ్‌లు క్లోజ్‌!

Published on Wed, 02/07/2024 - 16:45

అగ్రరాజ్యం అమెరికాలో రికార్డ్‌ స్థాయిలో బ్యాంక్‌ శాఖలు మూత పడుతున్నాయి. అక్కడి బ్యాంకులు గత నెలలో ఒక్క వారంలో 37 బ్యాంచ్‌లను మూసివేయడానికి అనుమతి కోరాయి. మూసేస్తున్న బ్యాంచ్‌లలో మూడింట రెండు వంతులు బ్యాంక్ ఆఫ్ అమెరికా, టీడీ బ్యాంక్,  కీబ్యాంక్ శాఖలే ఉన్నాయి.

అమెరికాలో బ్రాంచ్‌లను మూసేస్తున్న బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు వరుసలో నిలిచింది. ఇది గత సంవత్సరం దాదాపు 160 శాఖలను మూసేసింది. 2024 మొదటి నెలలోనే 30 బ్రాంచ్‌లు మూసేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ ధోరణి ఇంతటితో తగ్గేలా కనిపించడం లేదు.

యూఎస్‌ బ్యాంకుల నియంత్రణ సంస్థ ‘ఆఫీస్ ఆఫ్ ద కంప్ట్రోలర్‌ ఆఫ్‌ ద కరెన్సీ’ (OCC) నుంచి సమాచారం ఆధారంగా జనవరి  21 నుంచి 27వ తేదీ వరకు మూత పడిన బ్యాంక్‌ బ్రాంచ్‌ల వివరాలను డైలీ మెయిల్‌ కథనం పేర్కొంది. అమెరికాలో ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌ను మూసివేయాలనుకున్నా లేదా కొత్తది ఏర్పాటు చేయాలనుకున్నా ఓసీసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

యూఎస్‌ బ్యాంకుల నియంత్రణ సంస్థ ప్రకారం.. గత జనవరి నెలలో మొత్తం 139 షెడ్యూల్డ్ బ్యాంక్ బ్రాంచ్‌లు శాశ్వతంగా మూతపడ్డాయి. 2023లో నెలవారీ సగటు కంటే ఇది అధికం. మరో వారంలో 41 శాఖలు మూసివేస్తామని  అమెరికన్ బ్యాంకులు గత నెలలోనే ప్రకటించాయి.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)