Breaking News

బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయా?

Published on Sun, 01/04/2026 - 16:18

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ సైన్యం వెనెజువెలా రాజధాని కారకాస్‌పై భారీ దాడులు చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించిన సంఘటన (US attack on Venezuela) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి వంటి సేఫ్‌ హెవెన్ ఆస్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బంగారం, వెండి ధరలపై ప్రభావం
భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం, వెండి వైపు మళ్లుతారు. ఈ దాడి కారణంగా అనిశ్చితి పెరిగి, సేఫ్‌ హెవెన్ డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుత ధరలు (జనవరి 4 నాటికి భారత మార్కెట్‌లో) 24 క్యారెట్ బంగారం  10 గ్రాములకు సుమారు రూ.1,35,800 నుంచి రూ.1,37,000 వరకు (MCX ఫ్యూచర్స్ ప్రకారం) ఉంది. అలాగే 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,24,500. ఇక వెండి కిలోకు సుమారు రూ.2,40,000 నుంచి రూ.2,46,000 వరకు ఉంది.

మరింత పెరిగే అవకాశం
నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ఉద్రిక్తతలు కొనసాగితే బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 4,380 నుంచి 4,500 డాలర్లకు చేరవచ్చు. భారత్‌లో 10 గ్రాముల ధర రూ.1,40,000 స్థాయిని తాకే అవకాశం ఉంది.

వెండి ధరలు మరింత గణనీయంగా పెరిగి, అంతర్జాతీయంగా ఔన్స్‌కు  75-78 డాలర్లకు చేరవచ్చని అంచనా. ఇది సప్లై చైన్ డిస్టర్బెన్స్ (వెనెజువెలా ప్రాంత షిప్పింగ్ రూట్లు ప్రభావితం) కారణంగా కూడా జరుగవచ్చు. అయితే, ఈ పెరుగుదల తాత్కాలికమే కావచ్చు. ఉద్రిక్తతలు తగ్గితే ధరలు స్థిరపడవచ్చు లేదా కొద్దిగా పడిపోవచ్చు. 2026లో మొత్తంగా బంగారం ధరలు ఔన్స్‌కు 5,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Videos

సాక్షి ఫోటోగ్రాఫర్ పై తప్పుడు కేసు.. బుద్ధి చెప్పిన కోర్ట్

భయపడకు నేనున్నా.. వైఎస్ జగన్ ను కలిసిన నల్లజర్ల పోలీసు బాధితులు

తాజా రాజకీయ పరిణామాలపై నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్

ఎన్ని ప్రాణాలు పోయినా.. ఐ డోంట్ కేర్! నాకు భూములు కావాల్సిందే!!

అడ్డగోలు దోపిడీ.. సంక్రాంతికి ట్రావెల్స్ టికెట్ బాంబు

టీడీపీ గూండాలు చేసిన అరాచకాలను వైఎస్ జగన్ కు వివరించిన బొమ్మనహాళ్ ఎంపీటీసీలు

లిఫ్ట్ ఇరిగేషన్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. ప్రెస్ మీట్ లో నోరు విప్పని చంద్రబాబు

చిరు కోసం బాబీ మాస్టర్ ప్లాన్..! అదే నిజమైతే..

ఖబర్దార్ బాబు... ఎన్ని కేసులు పెట్టినా నిలదీస్తూనే ఉంటాం....

తెలంగాణ సీఎం రేవంత్ కామెంట్స్ పై నోరువిప్పని సీఎం చంద్రబాబు

Photos

+5

రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల స్కర్ట్‌లో ఆహా అనేలా జాన్వీ కపూర్ (ఫొటోలు)

+5

సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ క్యూట్ మెమొరీస్ (ఫొటోలు)

+5

మాయాబజార్ సావిత్రి లుక్‌లో యాంకర్ సుమ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో కలిసి కరీనా కపూర్ ఫారిన్ ట్రిప్‌ (ఫొటోలు)

+5

‘కార్ల్టన్ వెల్నెస్’ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మృణాల్‌ (ఫొటోలు)

+5

తిరుమలలో హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ (ఫొటోలు)

+5

కొత్త సంవత్సరం కొత్త కొత్తగా హీరోయిన్ కృతి శెట్టి (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ (ఫొటోలు)