Breaking News

ఎన్‌బీఎఫ్‌సీ బాహుబలి ఐపీవో!

Published on Tue, 08/19/2025 - 04:45

న్యూఢిల్లీ: అప్పర్‌లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీ.. టాటా క్యాపిటల్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 2 బిలియన్‌ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కంపెనీ విలువ 11 బిలియన్‌ డాలర్లు(రూ. 94,600 కోట్లు)గా నమోదుకానున్నట్లు తాజాగా అంచనా వేశాయి. ఈ ఇష్యూ పూర్తియితే దేశంలో అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ ఐపీఓగా రికార్డు సృష్టించనుంది.

 లిస్టింగ్‌కు వీలుగా టాటా గ్రూప్‌ దిగ్గజం ఇటీవలే క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో మొత్తం 26.58 కోట్ల షేర్లు విక్రయించనుంది. వీటిలో 21 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుండగా.. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 

టాటా క్యాపిటల్‌ మాతృ సంస్థ టాటా సన్స్‌ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్‌సీ 3.58 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్‌ చేయనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్‌ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్‌సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. కంపెనీ లిస్టయితే దేశీ ఫైనాన్షియల్‌ రంగంలో అతిపెద్ద ఐపీవోగా నమోదుకానుంది. వెరసి టాటా గ్రూప్‌ నుంచి రెండేళ్లలో రెండు కంపెనీలు లిస్టింగ్‌ను పొందినట్లవుతుంది. ఇంతక్రితం ఐటీ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్‌ 2023 నవంబర్‌లో ఐపీవో ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే.  

పటిష్ట పనితీరు: ఈ ఏడాది తొలి త్రైమాసికం (2025–26, క్యూ1)లో టాటా క్యాపిటల్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రెట్టింపై రూ.1,041 కోట్లకు చేరింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ.472 కోట్లు ఆర్జించింది. ఆదా యం రూ. 6,557 కోట్ల నుంచి రూ.7,692 కోట్లకు ఎగసింది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)