నెలకు 100 బిలియన్ల యూపీఐ లావాదేవీలు! 

Published on Wed, 09/06/2023 - 10:26

ముంబై: భారతదేశానికి నెలకు 100 బిలియన్ల యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలు నెరపే అవకాశం ఉందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దిలీప్‌ అస్బే పేర్కొన్నారు. ఆగస్ట్‌లో 2016లో ప్రారంభించిన తర్వాత ప్లాట్‌ఫారమ్‌ ద్వారా సాధించిన 10 బిలియన్‌ లావాదేవీల కంటే ఇది పది రెట్లు అధికమని పేర్కొన్నారు.

ప్రస్తుతం 350 మిలియన్ల యూపీఐ వినియోగదారులు ఉన్నారని, వ్యాపారులు వినియోగదారులలో వృద్ధి అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. యూపీఐ లావాదేవీలకు అన్ని వర్గాల నుంచి ప్రయత్నం జరిగితే 100 బిలియన్‌ లావాదేవీలకు చేసే సామర్థ్యం ఉందని ఇక్కడ జరిగిన గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫీస్ట్‌ కార్యక్రమంలో అన్నారు. 100 బిలియన్‌ లావాదేవీలకు చేరుకోడానికి లక్ష్యంగా పెట్టుకున్న తేదీని పేర్కొనడానికి నిరాకరించిన ఆయన, అయితే 2030 నాటికి భారతదేశం రోజుకు 2 బిలియన్ల లావాదేవీలను చూస్తుందని చెప్పారు. ప్రస్తుతం, గ్లోబల్‌ దిగ్గజం వీసా నెలకు 22.5 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్‌ చేస్తోంది.  దాని ప్రత్యర్థి మాస్టర్‌ కార్డ్‌ 11 బిలియన్లకు పైగా లావాదేవీలు చేస్తోంది.

పరిశ్రమ స్తబ్దత నుంచి అభివృద్ధి చెందుతున్న ధోరణికి మారితే క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం పది రెట్లు వృద్ధి చెందుతుందని అస్బే చెప్పారు. అయితే బ్యాంకులు సరైన ప్లాట్‌ఫారమ్‌లను అందిస్తేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం క్రెడిట్‌ కార్డ్‌లలో కొనుగోలు, పూచీకత్తు వ్యయం చాలా ఎక్కువగా ఉందని, ఇది ఈ ఇన్‌స్ట్రమెంట్‌ విస్తరణకు విఘాతంగా ఉందని తెలిపారు. 

Videos

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!

వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

చరిత్ర సృష్టించిన రష్మిక

Photos

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)