Breaking News

పోయిందనున్న ఫోన్.. యూపీఐ సాయంతో దొరికిందిలా..

Published on Tue, 09/23/2025 - 18:42

ఎక్కడైనా ఒకసారి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నామంటే.. దాన్ని తిరిగి పొందటం దాదాపు అసాధ్యం. అయితే ఓ జంట మాత్రం యూపీఐ సాయంతోనే పోయిన ఫోన్ పొందగలిగింది. ఇది వినడటానికి వింతగా అనిపించినా.. అసలు విషయం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది.

నా భార్య ఫోన్ తిరిగి పొందడంలో యూపీఐ సహాయపడింది అనే శీర్షికతో.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో ఈ రోజు నేను, నా భార్య ఆటోలో షాపింగ్‌కి వెళ్ళాము, గమ్యం చేరుకున్న తరువాత.. ఆటోకు యూపీఐ ద్వారా డబ్బులు పంపించాను. ఆటో వెళ్లిపోయింది. ఆ తరువాత చూస్తే నా భార్య ఫోన్ కనిపించలేదు. ఆ ఫోన్‌కు కాల్ చేద్దామంటే.. అప్పటికి అందులో సిమ్ కార్డు వేయలేదు.

మొదట్లో ఫోన్ ఎవరో దొంగలించి ఉంటారనుకున్నాము, తరువాత ఆలోచిస్తే ఆటోలో మారిపోయినట్లు గుర్తొచ్చింది. ఆటో డ్రైవర్ వివరాలు తెలుసుకుందామంటే.. స్కాన్ చేసి డబ్బు పంపించడం వల్ల అది సాధ్యం కాలేదు. మొత్తానికి ఫోన్ పోయింది అనుకున్నాము. ఇంతలో నా బ్యాంక్ ఖాతాకు ఒక్కరూపాయి యూపీఐ నుంచి వచ్చింది. అంతే కాకుండా పోయిందనుకుంటున్న ఫోన్ నా దగ్గర ఉంది అని.. ఒక నెంబర్ పంపి, దానికి కాల్ చేయమని మెసేజ్ వచ్చింది. మేము ఆ నెంబరుకు కాల్ చేసి.. ఎక్కడ ఉన్నారు అని కనుక్కున్నాం. కానీ ఆ ఆటో డ్రైవర్ మా దగ్గరకు వచ్చి ఫోన్ ఇచ్చాడు. మా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆటో డ్రైవరుకు కొంత డబ్బు కూడా ఇచ్చి పంపాను అని రెడ్డిట్ పోస్టులో వెల్లడించారు.

ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: మొదటి రోజే భారీగా అమ్ముడైన కార్లు

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)