ట్రంప్‌ టారిఫ్ ఆందోళనలు.. త్వరలో మంత్రి భేటీ

Published on Mon, 08/04/2025 - 12:41

భారత టెక్స్‌టైల్‌, అప్పారెల్‌ ఎగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వచ్చే వారం పరిశ్రమ ప్రముఖులతో సమావేశం కానున్నారు. ట్రంప్‌ నిర్ణయం వల్ల కలిగే పరిణామాలపై చర్చించేందుకు ఈ సమావేశం కీలకంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశపు టెక్స్‌టైల్‌ ఎగుమతి మార్కెట్‌లో భవిష్యత్తులో రాబోయే మార్పులు, వాటిని ఎలా సమర్థ​ంగా నిర్వహించాలో ఈమేరకు చర్చించనున్నారు.

అమెరికా టారిఫ్ ముప్పు

భారతదేశం మొత్తం వస్త్ర, దుస్తుల ఎగుమతుల్లో యునైటెడ్ స్టేట్స్ సుమారు 25% వాటాను కలిగి ఉంది. యూఎస్‌ ఈ రంగానికి అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. అమెరికాకు భారత్‌ చేసే ఎగుమతులపై 25 శాతం సుంకం ప్రకటించడం దేశీయ టెక్స్ టైల్ పరిశ్రమలో ఆందోళన రేకెత్తిస్తుంది. ఇది ధరల పోటీతత్వాన్ని, డిమాండ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దశలో పరిశ్రమకు నిర్దిష్ట ప్రభుత్వ మద్దతు ఉండాలని కొన్ని కంపెనీల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడానికి, పరిశ్రమ వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించడానికి పరిశ్రమ నాయకులతో జరిగే చర్చలు కొంత ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

యూకే-ఇండియా ఎఫ్‌టీఏ ఎఫెక్ట్‌

ఇటీవల యూకే-ఇండియా ఫ్రీట్రేడ్‌ అగ్రిమెంట్‌(ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్న నేపథ్యంలో రాబోయే సమావేశం ఎజెండా టారిఫ్ ఆందోళనలకే పరిమితం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌టీఏ ద్వారా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై కూడా చర్చలు జరగనున్నాయి. తగ్గిన సుంకాలు, సరళీకృత వాణిజ్య విధానాల ద్వారా భారతీయ వస్త్రాలకు యూకే మార్కెట్‌ను మరింత పెంచాలని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆస్తిపాస్తులు గోప్యంగా ఉంచితే అంతే..

100 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యం

ప్రభుత్వ మద్దతు, వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందాలతో భారతీయ వస్త్ర, దుస్తుల పరిశ్రమ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ మైలురాయిని చేరుకోవడానికి కీలక మార్కెట్ల నుంచి అనుకూలమైన విధానాలు అవసరం. అభివృద్ధి చెందుతున్న సరఫరా గొలుసు ధోరణులతో సహా మారుతున్న ప్రపంచ వాణిజ్య డైనమిక్స్‌ను అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు.

Videos

YSR ఫ్లెక్సీలు చింపేసిన దుండగులు.. కూకట్‌పల్లి లో YSRCP ఆందోళన

42 ఉద్యోగ సంఘాలకు లేఖ రాసిన ఏపీ JAC అమరావతి

Srinivasulu Reddy: కొడుకు కోసం మరీ ఇంత దిగజారుతావా..?

ఆపరేషన్ ‘రాటెన్ యాపిల్’.. న్యూయార్క్‌లో వేలాది మంది వలసదారుల అరెస్ట్

స్పోర్ట్స్ కోటాలో DSC అక్రమాలు బట్టబయలు..

బాబు పబ్లిసిటీపై YS జగన్ ఆగ్రహం

దారుణం చీకటిలోకి నేపాల్..నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

ఢిల్లీలో YSR అవార్డ్స్-2026 ప్రదానోత్సవం

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)