Breaking News

తీపితో సీక్రెట్‌ లాక్‌

Published on Wed, 01/28/2026 - 00:22

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌కు ముందు కీలక సంప్రదాయ కార్యక్రమం బడ్జెట్‌ హల్వా సెరమనీ న్యూఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌లో మంగళవారం ఘనంగా, సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంతో బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి, ఆర్థిక శాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్యదర్శులు, సీనియర్‌ అధికారులు, బడ్జెట్‌ తయారీలో పాల్గొన్న సిబ్బంది కలిసి హల్వాను పంచుకున్నారు.

భారత సంప్రదాయంలో శుభారంభానికి తీపి పంచుకోవడం ఆనవాయితీ కావడంతో, బడ్జెట్‌ ప్రక్రియ ప్రారంభానికి ఇది ప్రతీకగా కొనసాగుతోంది. వచ్చే నెల (ఫిబ్రవరి)1 న ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు బడ్జెట్‌ను సమరి్పంచనున్నారు. హల్వా వేడుక తర్వాత ఆర్థిక మంత్రి సీతారామన్‌ బడ్జెట్‌ ముద్రణ విభాగాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. మొత్తం బడ్జెట్‌ బృందానికి ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలియజేశారు.  

బడ్జెట్‌ వరకు దిగ్బంధం 
బడ్జెట్‌ రూపకల్పనలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బంది పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం ముగిసే వరకు నార్త్‌ బ్లాక్‌లోనే (లాకిన్‌) ఉండిపోతారు. బాహ్య ప్రపంచంతో వారికి ఎలాంటి సమాచార, సంబంధాలు ఉండవు. బడ్జెట్‌ తుది పత్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్‌ అవ్వకుండా ఈ విధానాన్ని పాటిస్తుంటారు. ఇలా లాకిన్‌లో ఉండే అధికారులు, సిబ్బందికి అభినందన పూర్వకంగా హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నార్త్‌బ్లాక్‌ బేస్‌మెంట్‌లోని ప్రింటింగ్‌ ప్రెస్‌లోనే 1980 నుంచి 2020 వరకు బడ్జెట్‌ ప్రతులను ముద్రించే వారు. ఆ తర్వాత నుంచి పరిమితంగా కొన్ని పత్రాలను ముద్రించి, మిగిలిన మొత్తం డిజిటల్‌ రూపంలోకి మారింది. 1950కు పూర్వం రాష్ట్రపతి భవన్‌లో బడ్జెట్‌ పత్రాల ముద్రణ నడిచింది. డాక్యుమెంట్లు లీక్‌ అవ్వడంతో 1950లో మింట్‌రోడ్‌కు మార్చారు. ఆ తర్వాత 1980లో నార్త్‌బ్లాక్‌కు మారింది.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)