Breaking News

బడ్జెట్ 2025 రూపొందించిన ప్రముఖులు వీరే..

Published on Tue, 01/28/2025 - 19:16

ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) తన ఎనిమిదవ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే.. బడ్జెట్ తయారీ చివరి దశకు గుర్తుగా 'హల్వా వేడుక' కూడా ముగిసింది. కాగా త్వరలో సమర్పించనున్న బడ్జెట్‌ను రూపొందించే వ్యక్తులు ఎవరనేది, ఈ కథనంలో చూసేద్దాం.

తుహిన్ కాంత పాండే (ఆర్థిక & రెవెన్యూ కార్యదర్శి)
తుహిన్ కాంత పాండే 1987 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి. ఆర్ధిక, రెవెన్యూ విభాగాల్లో ఈయనకు గొప్ప అనుభవం ఉంది. పన్ను రాయితీలను బ్యాలెన్స్ చేస్తూ.. ఆదాయాలను తగ్గకుండా చూసుకోవాల్సిన పని ఈయనదే. బడ్జెట్ ప్రారంభం కావడానికి ముందు.. పాండే ఈ బాధ్యతలను స్వీకరించారు. కాగా రాబోయే సెషన్‌లో ఆదాయపన్ను చట్టాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది.

వీ అనంత నాగేశ్వరన్ (ప్రధాన ఆర్థిక సలహాదారు)
అనంత నాగేశ్వరన్ ఐఐఎమ్ అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి. ఈయన ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలిలో తాత్కాలిక సభ్యునిగా పనిచేశారు. అతను, అతని బృందం రచించిన ఆర్థిక సర్వే అభివృద్ధిని ప్రోత్సహించడం, సంస్కరణ ఫలితాలను అంచనా వేయడం వంటివి చేస్తుంది.

మనోజ్ గోవిల్ (డిపార్ట్‌మెంట్ ఆప్ ఎక్స్‌పెండిచర్‌ కార్యదర్శి)
మనోజ్ గోవిల్ 1991 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన డిపార్ట్‌మెంట్ ఆప్ ఎక్స్‌పెండిచర్‌ కార్యదర్శిగా చేరడానికి ముందు.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. రాయితీల హేతుబద్ధీకరణ మరియు కేంద్ర ప్రాయోజిత పథకాలు ఖర్చు నాణ్యతను మెరుగుపరచడం వంటివి గోవిల్ బృందం విధి.

అజయ్ సేథ్ (ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి)
అజయ్ సేథ్.. 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన తుది బడ్జెట్ పత్రాలను సిద్ధం చేయడం, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పర్యవేక్షించే విభాగానికి నాయకత్వం వహిస్తారు. ఆర్ధిక వనరులను నిర్వహించడం, వ్యయాల నియంత్రణ అంటివన్నీ ఆయన పర్యవేక్షణలోనే ఉంటాయి.

ఇదీ చదవండి: అరుణాచల్‌ ప్రదేశ్‌పై ప్రశ్న.. ఖంగుతినే సమాధానం చెప్పిన డీప్‌సీక్

ఎం నాగరాజు (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్)
నాగరాజు 1993 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చేరడానికి ముందు.. ప్రైవేట్ వాణిజ్య మైనింగ్ రంగంలో ఉన్నారు. ఆ సమయంలోనే సుమారు 113 కంటే ఎక్కువ బొగ్గు గనులను వేలం వేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈయన బృందం డిపాజిట్ల మొబలైజేషన్, ఫిన్‌టెక్‌ల నియంత్రణ, బీమా కవరేజిలను పెంచడం వంటివి చూస్తుంది.

అరుణిష్ చావ్లా (డీఐపీఏఎం & డీపీఈ సెక్రటరీ)
అరుణిష్ చావ్లా 1992 బ్యాచ్ బీహార్ కేడర్ ఐఏఎస్ అధికారి. అయితే ఆర్థిక మంత్రి బృందంలో కొత్త సభ్యుడు. చావ్లా ఇంతకుముందు ఫార్మాస్యూటికల్స్ విభాగానికి నాయకత్వం వహించారు. అయితే ప్రస్తుతం ఆస్తుల నిర్వహణ, డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్ వంటి అంశాలను పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా.. ఐడీబీఐ బ్యాంక్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఉన్న ఆస్తుల నుంచి నిధుల సమీకరణకు ప్రణాళికలు తయారు చేశారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)