Breaking News

ఖాతాల్లోనే మిగిలిపోయిన డబ్బు.. ఇక ఒకే పోర్టల్‌!

Published on Sun, 11/30/2025 - 07:24

క్లెయిమ్‌ చేయకుండా ఖాతాల్లోనే మిగిలిపోయిన డిపాజిట్లు, పెన్షన్‌ ఫండ్, షేర్లు, డివిడెండ్లను క్లెయిమ్‌ చేసుకోవడంలో ప్రజలకు సహాయకరంగా ఉండేలా రిజర్వ్‌ బ్యాంక్‌తో కలిసి సమగ్ర పోర్టల్‌ను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అన్‌క్లెయిమ్డ్‌ అసెట్స్‌ కోసం ఉద్గాం పేరుతో ఆర్‌బీఐ, మిత్ర పేరిట మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, బీమా భరోసా పేరుతో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ వేర్వేరు పోర్టల్స్‌ నిర్వహిస్తున్నాయి. ’మీ డబ్బు, మీ హక్కు’ పేరిట అన్‌క్లెయిమ్డ్‌ అసెట్స్‌పై అక్టోబర్‌ 4న కేంద్ర ఆర్థిక మంత్రి దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏఐ, సెబీ, ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ (ఐఈపీఎఫ్‌ఏ)తో కలిసి ఆర్థిక సేవల విభాగం దీన్ని ప్రారంభించింది. ఇప్పటికే రూ. 1,887 కోట్ల మొత్తాన్ని సిసలైన యజమానులు లేదా వారి నామినీలకు అందజేసినట్లు నాగరాజు వివరించారు. అవగాహన లేకపోవడం లేదా అకౌంట్‌ వివరాలను అప్‌డేట్‌ చేయకపోవడం వల్ల చాలా ఖాతాల్లో బీమా పాలసీ క్లెయిమ్‌లు, బ్యాంక్‌ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యుచువల్‌ ఫండ్స్‌ ద్వారా వచ్చే నిధులు పెద్ద మొత్తంలో ఉండిపోతున్నాయి. వీటిని అన్‌–క్లెయిమ్డ్‌ అసెట్స్‌గా పరిగణిస్తున్నారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)