Breaking News

కుర్రకారుని ఉర్రూతలూగించే అల్ట్రావయోలెట్ ఎఫ్77.. డెలివరీస్ షురూ

Published on Tue, 02/28/2023 - 21:27

ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదలై కుర్రకారుని ఉర్రూతలూగించిన అల్ట్రావయోలెట్ ఎఫ్77 డెలివరీలు ప్రారంభమయ్యాయి. కంపెనీ దేశ వ్యాప్తంగా డీలర్‌షిప్‌లను ప్రారంభించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. అయితే ప్రస్తుతం మొదటి డెలివరీలు బెంగళూరులో ప్రారంభమయ్యాయి.

దేశీయ మార్కెట్లో అల్ట్రావయోలెట్ ఎఫ్77 ధరలు రూ. 3.80 లక్షల నుంచి రూ. 4.55 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇది మొత్తం మూడు వేరియంట్స్‌లో లభిస్తుంది. కొనుగోలుదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 10,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

కంపెనీ తన అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైకుని గ్లోబల్ మార్కెట్లో కూడా విక్రయించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ బైక్ భారతీయ రోడ్ల మీద మాత్రమే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, జపాన్, ఇతర ఆగ్నేయాసియా దేశాల రోడ్ల మీద కూడా తిరగనున్నాయి.

అల్ట్రావయోలెట్ ఎఫ్77 వేరియంట్ 7.1kWh బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 207 కిలోమీటర్ల రేంజ్, రీకాన్ వేరియంట్ 10.3kWh బ్యాటరీ ప్యాక్ కలిగి 307 కిమీ రేంజ్, లిమిటెడ్ ఎడిషన్ కూడా 307 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఇది 77 యూనిట్లకు మాత్రమే పరిమితం.

అల్ట్రావయోలెట్ ఎఫ్77 వేరియంట్ బరువు 197 కేజీలు కాగా, రీకాన్ వేరియంట్ బరువు 187 కేజీల వరకు ఉంటుంది. ఈ రెండు వేరియంట్స్ అవుట్‌పుట్ గణాంకాలు వేరుగా ఉంటాయి. ఎఫ్77 వేరియంట్ గరిష్టంగా 36.2 బిహెచ్‌పి పవర్, 85 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. రీకాన్ వేరియంట్ 38.88 బిహెచ్‌పి పవర్, 95 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)