Breaking News

మానవ వనరులను ఆకర్షించడంలో విఫలం

Published on Fri, 09/13/2024 - 19:04

విదేశాల్లోని నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో యూకే ప్రభుత్వం విఫలమవుతోంది. దానివల్ల రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్షీణిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వెళ్లే వలసదారులు యూరప్‌లో పనిచేసేందుకు యూకేకు బదులుగా ఎక్కువ ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌ను ఎంచుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

యూకే ప్రభుత్వం నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతుంది. ఆన్‌లైన్‌ జాబ్‌ సెర్చ్‌ వెబ్‌సైట్‌ ఇండీడ్‌ ఆరు నెలలపాటు సర్వే చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం..యూరప్‌లో ఉద్యోగం చేయాలని భావించేవారిలో ఎక్కువగా అత్యధిక ప్యాకేజీ ఆశిస్తున్నవారే ఉన్నారు. యూకే ఉద్యోగం చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే అక్కడి ప్రభుత్వ విధానాలు, తక్కువ వేతనాలు ఆఫర్‌ చేయడంతో ఆసక్తి చూపించడంలేదు. యూకే కంటే మెరుగైన వేతనాలు అందించే ఫ్రాన్స్‌, నెదర్గాండ్స్‌ను ఎంచుకుంటున్నారు.  

యూకేలో స్థానికులకు నైపుణ్యాలు పెంపొందిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా విదేశీయుల అవసరాన్ని తగ్గిస్తామని ప్రధానమంత్రి కైర్ స్టార్‌మర్ గతంలో తెలిపారు. దాంతో అధిక నైపుణ్యాలు కలిగిన వారు ఆ దేశానికి వెళ్లకపోవడానికి ఇదో కారణంగా ఉంది. ఐటీ, ఇంజినీరింగ్ వంటి అత్యంత ఉత్పాదక రంగాల్లో ఇప్పటికే సిబ్బంది కొరత ఉంది. చాలా కంపెనీలు లేఆఫ్స్‌ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నవారిపైనే ఎక్కువ పని ఒత్తిడి ఉంటోంది.

ఇదీ చదవండి: ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోం’

2021లో యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన యూకే ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసిందనే వాదనలున్నాయి. దీనివల్ల అధిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో వెనకబడుతోందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కంటే ముందు యూకేలో ఉద్యోగం చేయడానికి 54 శాతం విదేశీయులు ఇష్టపడేవారని కొన్ని సర్వేలు నివేదించాయి. ఇదిలాఉండగా, ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొస్తే నైపుణ్యాలు కలిగిన విదేశీయులు యూకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దాంతోపాటు స్థానికంగా మెరుగైన జీవిన విధానానికి సరిపడే వేతనాలు అందించినా పరిస్థితిలో మార్పులు వస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)