Breaking News

భారతీయులకు షాకుల మీద షాకులిస్తున్న యూకే ప్రధాని రిషి సునాక్‌!

Published on Fri, 12/22/2023 - 18:32

భారతీయులతో పాటు, ఇతర విదేశీయులకు యూకే ప్రధాని రిషి సునాక్‌ వీసా మంజూరులో షాకుల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే నాన్ రీసెర్చ్ పీజీ విద్యార్థులు తమ వెంట కుటుంబ సభ్యులను (dependent visa) తీసుకుని వచ్చేందుకు అవసరమయ్యే డిపెండెంట్‌ వీసాను రద్దు చేశారు. తాజాగా యూకేలో ఇపై జాబ్‌ చేయాలంటే ఉద్యోగుల (skilled worker visa) జీతం  ఎక్కువగా ఉండాలనే కొత్త నిబంధనను తెచ్చింది. దీంతో విద్యార్ధులతో పాటు ఉద్యోగం చేసే వారు సైతం ఇకపై యూకేకి వెళ్లడం మరింత కఠినంగా మారనుంది. 
 
వచ్చే ఏడాది యూకేలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా దేశంలోకి వలసల్ని నిరోధించేలా వీసా మంజూరులో కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. 


 
యూకేలో ఫ్యామిలీ వీసా రూల్స్‌?
తాజాగా, స్కిల్డ్‌ వర్క్‌ వీసా పొందాలంటే ఉద్యోగుల కనీస వేతనాన్ని 47 శాతం అంటే 29,000 యూరోల నుంచి 38,700 యూరోలకు పెంచింది. అయితే ఈ కనీస వేతనం హెల్త్‌ కేర్‌, సోషల్‌ కేర్‌ విభాగాలకు వర్తించదు. కేర్‌ వర్క్‌ర్లు వాళ్ల కుటుంబ సభ్యుల్ని యూకేకి తెచ్చుకునేందుకు అనుమతి లేదు. 

యూకేకి పెరిగిపోతున్న విదేశీయుల తాకిడి
ఈ ఏడాది జూన్‌లో 70,000 మంది విదేశీయులు యూకేలో నివసించేందుకు వచ్చారు. అయితే, రోజురోజుకు విదేశీయుల తాకిడి పెరుగుతుండటంతో వసతుల కల్పన బ్రిటన్ సర్కార్‌కు ఇబ్బందికరంగా మారింది. కాబట్టే ఈ ఆంక్షల్ని విధించింది. అదే సమయంలో ఇప్పటికే వీసా ఉండి దానిని రెన్యూవల్‌ చేసుకునే వీసా దారులకు కొత్త నిబంధనలు వర్తించవని యూకే ఇమ్మిగ్రేషన్ విభాగం హోం ఆఫీస్‌ తెలిపింది. 

స్కిల్డ్‌ వర్క్‌ వీసా పొందాలంటే?
యూకే విధించిన కొత్త నిబంధనల ఆధారంగా స్కిల్డ్‌ వర్క్‌ వీసా పొందాలంటే వీసా దారులు కనీసం 70 పాయింట్స్‌ ఉండాలి. అందులో 50 పాయింట్లు మీరు కనీస నైపుణ్య స్థాయి కంటే ఎక్కువ జాబ్ ఆఫర్‌ను కలిగి ఉండటం, ఇంగ్లీష్ మాట్లాడటం ద్వారా పొందవచ్చు. మిగిలిన 20 పాయింట్లు ఎక్కువ జీతం, చేస్తున్న విభాగంలో ఉద్యోగుల కొరత ఉండాలి. లేదంటే చేసే జాబ్‌కు అనుగుణంగా పీహెచ్‌డీ చేసి ఉండాలి. 

యూకేలో ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉన్న విభాగాలు
తక్కువ వేతనం ఉండి ఉద్యోగుల డిమాండ్‌ ఎక్కువగా ఉన్న విభాగాలకు చెంది ఉండి ఉంటే పైన పేర్కొన్న విధంగా 70 పాయింట్లు లభిస్తాయి. వీసా ఈజీగా దొరుకుతుంది. ఇక యూకేలో ఉద్యోగులు తక్కువగా ఉన్న విభాగాల్ని పరిశీలిస్తే

ఆరోగ్యం, విద్యా

కేర్‌ టేకర్లు

గ్రాఫిక్స్‌ డిజైనర్లు 

కన్‌స్ట్రక్టన్‌ వర్కర్లు

పశువైద్యులు
     
నాన్ రీసెర్చి కోర్సుల్లోని పీజీ విద్యార్ధులకు నో ఛాన్స్‌ 
భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్ధులకు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని అమెరికా, బ్రిటన్‌, కెనడా వంటి దేశాలకు తరలివెళుతుంటారు. వారితో పాటు వారి కుటుంబసభ్యులు డిపెండెంట్‌ వీసాను అందిస్తుంటాయి. జనవరి 1 నుంచి యూకే ప్రభుత్వం నాన్ రీసెర్చి కోర్సుల్లోని పీజీ విద్యార్ధులకు డిపెండెంట్‌ వీసాను రద్దు చేసింది.  బ్రిటన్ విధానం ప్రకారం వీసా హోల్డర్‌పై ఆర్థికంగా ఆధారపడిన వారిని మాత్రమే డిపెండెంట్‌గా పరిగణిస్తారు. ఆ జాబితాలోకి జీవిత భాగస్వామి అంటే భార్య లేదా భర్త, 18 ఏండ్ల లోపు పిల్లలు వస్తారు. కొన్ని సందర్భాల్లో 18 ఏండ్లు దాటిన పిల్లలు, తల్లిదండ్రులు, బామ్మలు, తాతయ్యలు వస్తారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)