Breaking News

హైద‌రాబాద్‌ నగరంలో భారీ సంఖ్యలో కొత్త కార్ల బుకింగ్‌

Published on Sun, 03/30/2025 - 16:26

హైద‌రాబాద్‌ నగరంలో పలు సాంస్కృతిక వేదికల్లో ఉగాది (Ugadi) ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు భాషా సాంస్కృతి శాఖ ఆధ్వరంలోనే కాకుండా పలు సాహిత్య, సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో కళ, నృత్య ఉత్సవాలు, సాహిత్య వేడుకలు, ఉగాది పురస్కారాల సంబరాలను నిర్వహిస్తున్నారు. వారాంతాలతో పాటు సోమవారం రంజాన్‌ పండుగ కూడా కలిసి రావడంతో మూడు రోజుల సెలవులను ఆస్వాదించడానికి ఈ వేదికలను ఎంచుకుంటున్నారు.

సోషల్‌ మీడియాలో షష్ట గ్రహ కూటమి.. 
గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో షష్ట గ్రహ కూటమి ((Shasta Graha Kutami) అనే అంశం వైరల్‌గా మారింది. అరుదుగా సంభవించే ఈ షష్ట గ్రహాల కూటమి వల్ల పలు మార్పులు సంభవిస్తాయని, ముఖ్యంగా రాశులపై ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్యులు, పండితులు వెల్లడిస్తున్నారు. 2019లో సంభవించిన ఈ షష్ట గ్రహ కూటమి అనంతరం కరోనా (Corona) మహమ్మారి విజృంభించిందని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కానీ, విశ్వంలో నిత్యం ఏర్పడే మార్పుల్లో భాగంగానే ఈ ఆరు గ్రహాల కూటమి, అంతకు మించి ఎలాంటి ప్రభావాలూ ఉండబోవని నగరానికి చెందిన పరిశోధకులు సోషల్‌మీడియా (Social Media) వేదికగా పోస్టులు షేర్‌ చేస్తున్నారు.  

ఉగాదికి కోరిక తీరింది.. 
వసంతానికి శుభారంబంగా అందరి జీవితాల్లోనూ వసంత శోభ వరించాలని ప్రకృతి దీవెనలతో నూతన సంవత్సరాది ప్రారంభమవుతోంది. అయితే ఈ ఏడాది అందరి చూపు నూతన వాహనాలపై పడింది. ప్రస్తుత బడ్జెట్‌ కేటాయింపుల్లో భాగంగా వాహనాలపై టాక్స్‌ పెరగనుందని నివేదికలు చెబుతున్న నేపథ్యంలో ఈ ఉగాదికి నగరవాసులు భారీ సంఖ్యలో కొత్త వాహనాలను బుకింగ్‌ చేసుకున్నారని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

చ‌ద‌వండి: హైద‌రాబాద్‌లో రియ‌ల్ఎస్టేట్ ప‌త‌నం

తెలుగు సంవత్సరాది.. అందరికీ ఇష్టమైన ఉగాది..! 
జీవితంలో అన్ని అనుభవాలను, అనుభూతులను సముపాళ్లలో ఆస్వాదించాలనే మంచి సందేశాన్నందిస్తూ నూతన తెలుగు ఏడాదికి ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో నగరమంతా కొంగొత్త ఆశలతో పండుగ శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి ఆంధ్రా, దసరాకు తెలంగాణ (Telangana) ఊళ్లకు ప్రయాణమయ్యే నగరవాసులు.. ఉగాదికి మాత్రం నగరంలో ఉండటానికే ప్రధాన్యమిస్తున్నారు. ఈ సందర్భంగా నగరమంతా ఉగాది సంబరాల ఏర్పాట్లు, షాపింగ్‌ సందడితో కనిపిస్తోంది. మరోవైపు సాంస్కృతికప్రదర్శనలు, ఉగాది పురస్కారాలు, సాహిత్య కార్యక్రమాలు వంటి ఉత్సవాలకు సిద్ధమైంది.               
– సాక్షి, సిటీబ్యూరో 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)