Breaking News

‘డాలర్‌ ఫైనాన్సియల్‌ టెర్రరిస్ట్‌’..

Published on Sun, 04/30/2023 - 22:16

అమెరికన్‌ డాలర్‌ ‘ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది’ అని చేసిన వ్యాఖ్యపై కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ తాజాగా వివరణ ఇచ్చారు. ఆ మాట తాను అనుకోకుండా అన్నానన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘యూఎస్‌ డాలర్‌పై ఇటీవల జరిగిన చర్చలో నేను అనుకోకుండా "ఆర్థిక ఉగ్రవాది" అనే పదాలను ఉపయోగించాను. నా ఉద్దేశం ఏమిటంటే రిజర్వ్ కరెన్సీకి అసమాన శక్తి ఉంటుంది. అది నోస్ట్రో ఖాతా అయినా కావచ్చు. 500 బీపీఎస్‌ రేటు పెరుగుదల అయినా లేదా లిక్విడిటీ కోసం యూఎస్‌ డాలర్‌ను కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలైనా కావచ్చు’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఐఆర్‌డీఏఐ కీలక ఆదేశాలు.. 

రిజర్వ్ డాలర్‌గా ఉన్న అమెరికన్ డాలర్ హోదా అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే శక్తిని ఇస్తుందన్నారు. చరిత్రలో కీలకమైన ఈ తరుణంలో ప్రపంచం కొత్త రిజర్వ్ కరెన్సీ కోసం వెతుకుతోందని తాను భావిస్తున్నట్లు కోటక్ ఒక కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. యూరప్, బ్రిటన్, జపాన్, చైనాతో సహా ఇతర దేశాలు తమ కరెన్సీలను రిజర్వ్ కరెన్సీలుగా పేర్కొనడానికి ముందస్తు అవసరాలు లేవని ఆయన అన్నారు. రూపాయి రిజర్వ్ కరెన్సీ కావాలంటే దేశం బలమైన సంస్థలను, వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు.

గత మార్చి త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంక్  స్టాండ్‌లోన్ నికర లాభం రూ. 3,495.6 కోట్ల వద్ద 26.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం 35 శాతం పెరిగి రూ.6,102.6 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నికర నిరర్థక ఆస్తులు నాల్గవ త్రైమాసికంలో రూ.1,193.30 కోట్లకు తగ్గాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.1,736.71 కోట్లు. శాతాల పరంగా, నికర ఎన్‌పీఏ నికర అడ్వాన్స్‌లలో 0.64 శాతం నుంచి 0.37 శాతానికి మెరుగుపడింది.

ఇదీ చదవండి: ATM Fraud Alert: ఏటీఎం కార్డ్ మెషిన్‌లో ఇరుక్కుపోయిందా.. జాగ్రత్త!

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)