Breaking News

చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!

Published on Tue, 05/06/2025 - 18:54

కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ 'ఉదయ్ కోటక్'.. ముంబైలోని వర్లి సీ-ఫేస్‌లో ఒక నివాస భవనాన్ని రూ. 400 కోట్లకంటే ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.2.75 లక్షలు అని సమాచారం. దీంతో ఇది దేశీయ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధిక ధరగా రికార్డ్ క్రియేట్ చేసింది.

కోటక్ ఫ్యామిలీ ఇప్పటికే ఈ భవనంలోని 24 ఫ్లాట్లలో 13 ఫ్లాట్లను రిజిస్టర్ చేసుకుంది. తాజాగా మరో 8 ఫ్లాట్లను రూ. 131.55 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో ఫ్లాట్ 444 నుంచి 1004 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. వీటి ధర రూ. 12 కోట్ల నుంచి రూ. 27.59 కోట్లు. మిగిలిన 3 ఫ్లాట్లకు ఎంత చెల్లించారో వెల్లడించకపోయినా, మొత్తం భవనం విలువ రూ. 400 కోట్లను దాటినట్లు తెలుస్తోంది. ఈ భవనంలోని 173 చదరపు అడుగుల ప్లాట్ ధర రూ. 4.7 కోట్లు కావడం గమనార్హం. అయితే ఇందులోనే 1396 చ.అ ఫ్లాట్ ధర రూ. 38.24 కోట్లు. ఇది ముంబైలోని నాగరిక వర్లి ప్రాంతంలో అరేబియా సముద్రం.. ముంబై తీరప్రాంత రహదారికి అభిముఖంగా ఉంటుంది.

కోటక్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ మొత్తం ప్లాట్లను ఒకటిగా చేసి మళ్ళీ రీడెవల్పెమెంట్ ఏమైనా చేస్తుందా?, లేక ఉన్నది ఉన్నట్లుగానే ఉంచుతుందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ డీల్‌కు సంబంధించిన విషయాలను కోటక్ కుటుంబం అధికారికంగా వెల్లడించలేదు.

ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్

#

Tags : 1

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)