Breaking News

ఫ్లైట్ మిస్ అయితే రూ.7500 పరిహారం!: ఉబర్ కీలక ప్రకటన

Published on Sat, 03/15/2025 - 14:47

క్యాబ్ అగ్రిగేటర్ దిగ్గజం 'ఉబర్' (Uber) ముంబైలోని.. తన కస్టమర్ల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఆలస్యం కారణంగా విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం అందించనున్నట్లు వెల్లడించింది. ఈ కవరేజ్ ప్లాన్‌కు 'మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్' అని పేరు పెట్టారు. దీనితో పాటు, ఒకవేళా ప్రమాదం జరిగిన సందర్భాలలో ఔట్ పేషెంట్ (OPD) ఛార్జీలతో సహా వైద్య ఖర్చులను కూడా కంపెనీ కవర్ చేస్తుంది.

2024 ఫిబ్రవరి చివరలో ఉబర్.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ ప్లాన్‌ను ప్రారంభించారు. విమానాశ్రయానికి సకాలంలో చేరుకోవడం చాలా ముఖ్యం. అయితే నగరంలోని ట్రాఫిక్ కారణంగా కొన్ని సార్లు ఆలస్యం అవ్వొచ్చు. అలాంటప్పుడు ఈ పరిహారం వారికి కొంత ఉపశమనం అందిస్తుంది.

ఇదీ చదవండి: భారత్‌కు ఆ రెండు టెస్లా కార్లు!.. సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు

విమానాశ్రయానికి రైడ్ బుక్ చేసుకుని, ఫ్లైట్ మిస్ అయితే మాత్రమే ఈ పరిహారం లభిస్తుంది. ఉబర్ ప్లాన్ కింద పరిహారం పొందాలంటే.. రైడ్ బుక్ చేసుకున్న వ్యక్తి సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్, మిస్ అయిన ఫ్లైట్ టికెట్ కాపీతో పాటు.. మళ్ళీ కొత్తగా బుక్ చేసుకున్న కొత్త విమానం టికెట్ వంటి అవసరమైన వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)