Breaking News

ఉబర్‌ ఆటో బుకింగ్‌.. ఇక ఓన్లీ క్యాష్‌ పేమెంట్‌!

Published on Thu, 02/20/2025 - 20:24

ఉబెర్, ఓలా, రాపిడో వంటి రైడ్ హెయిలింగ్ సర్వీస్‌ ద్వారా ఆటో బుక్‌ చేసినప్పుడు పేమెంట్‌ ఆయా రైడ్‌ యాప్‌లకు కాకుండా నేరుగా తమకే క్యాష్‌ రూపంలో ఇవ్వాలని డ్రైవర్లు పట్టుబడుతూ ఉంటారు. ఈ విషయంలో అటు డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థ ఉబర్‌ (Uber) కీలక నిర్ణయం తీసుకుంది.

ఉబర్‌ (Uber) ఆటో రైడ్‌లకు పేమెంట్‌ విషయంలో కీలక మార్పులు చేసింది. తమ యాప్‌ ద్వారా ఆటోలు బుక్‌ చేశాక ఇకపై నేరుగా డ్రైవర్‌కే చెల్లింపులు చేయాలని, ఆటో డ్రైవర్‌కు, ప్రయాణికుడికి మధ్య జరిగే లావాదేవీల విషయంలో ఉబర్‌ ఎటువంటి జోక్యం చేసుకోదని పేర్కొంది. 

‘సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌’ (SaaS) విధానానికి మారుతున్న క్రమంలో ఉబర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానాన్ని ఫిబ్రవరి 18 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఉబెర్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో ఈ మార్పును వివరించింది. తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, డ్రైవర్లు, ప్రయాణికుల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.

కొత్త మార్పులు ఇవే.. 
ప్రయాణికులను సమీపంలోని ఆటో డ్రైవర్లతో అనుసంధానించే పని మాత్రమే ఉబర్ చేస్తుంది. ఇంతకు ముందు మాదిరి ఉబర్‌కు డిజిటల్ చెల్లింపులు ఇక ఉండవు.  నేరుగా డ్రైవర్‌కే నగదు రూపంలో లేదా యూపీఐ (UPI) రూపంలో ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. ఆటో ట్రిప్‌లకు ఉబర్ క్రెడిట్స్‌, ప్రమోషన్‌ ఆఫర్‌లు వర్తించవు. డ్రైవర్ల నుంచి ఉబర్‌ ఎటువంటి కమీషన్ తీసుకోదు. కేవలం ప్లాట్‌ఫామ్‌ను మాత్రమే అందిస్తుంది. ఎటువంటి క్యాన్సిలేషన్‌ ఛార్జీలు ఉండవు. ఉబర్ కేవలం ఛార్జీని సూచిస్తుంది. కానీ తుది మొత్తాన్ని డ్రైవర్, ప్రయాణికులే పరస్పరం నిర్ణయించుకోవాలి. కానీ భద్రత విషయంలో మాత్రం ఉబర్‌ ప్రమేయం ఉంటుంది.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)