Breaking News

ట్విటర్‌ క్రాష్‌: ఇష్టమొచ్చినట్లు ఉద్యోగులను పీకేస్తే ఇలాగే ఉంటుంది!

Published on Sun, 05/28/2023 - 17:25

ఒకప్పుడు 100 మందికి పైగా ఉద్యోగులున్న ట్విటర్‌లోని ఆ విభాగంలో ఇప్పుడు పనిచేస్తున్నది కేవలం ముగ్గురంటే ముగ్గురే. ట్విటర్‌లో ఆడియో సంభాషణలకు సంబంధించిన ట్విటర్‌ స్పేసెస్‌ విభాగంలో ప్రస్తుతం మిగిలింది ముగ్గురేనని ప్లాట్‌ఫార్మర్‌ అనే సంస్థ నివేదిక ద్వారా వెల్లడైంది.  

ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డెశాంటిస్‌ తాను అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నట్లు ట్విటర్‌ ద్వారా ప్రకటించడం ఇటీవల సంచలనం సృష్టించింది.  అమెరికా పునర్‌ వైభవం కోసం తాను పోటీ చేయబోతున్నట్లు ట్వీట్‌ చేశారాయన. ఎలాన్‌ మస్క్‌తో కలిసి ఆయన ట్విటర్‌ స్పేసెస్‌ ద్వారా లైవ్‌ ఆడియో ఛాట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ట్విటర్‌ క్రాష్‌ అయిపోవడం తెలిసిందే.

అయితే ట్విటర్‌ క్రాష్‌ కావడంపై తాజాగా ఆసక్తికర నివేదిక వెలుగులోకి వచ్చింది. ట్విటర్‌ స్పేసెస్‌ విభాగంలో ఒకప్పుడు 100 మంది సిబ్బంది పనిచేస్తుండగా ఇప్పుడున్నది కేవలం ముగ్గురేనని తెలిసింది. ట్విటర్‌ స్సేసెస్‌ బృందం చాలా నెలలుగా సంస్థాగత జ్ఞానం లేకుండానే పనిచేస్తోందని ఆ నివేదిక పేర్కొంది. కాగా క్లబ్‌హౌస్‌ అనే సంస్థకు పోటీగా ట్విటర్‌ 2021లో ట్విటర్‌ స్పేసెస్‌ పేరుతో ప్రత్యక్ష ఆడియో సంభాషణలను జోడించింది. ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ ఆధీనంలోకి తీసుకున్నాక ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు 100  మంది ఉన్న ట్విటర్‌ స్పేసెస్‌లో ఇప్పుడు మిగిలింది కేవలం ముగ్గరే అని ప్లాట్‌ఫార్మర్‌ నివేదిక బహిర్గతం చేసింది.

ఇదీ చదవండి: Friendship Recession: మరో కొత్త మాంద్యం! ఏంటది.. నిఖిల్‌ కామత్‌ ఏమన్నారు? 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)