Breaking News

భారత్‌లో ఐఫోన్‌ తయారీకి ఆసక్తి చూపడం లేదు: ట్రంప్‌

Published on Thu, 05/15/2025 - 14:21

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోహా పర్యటన సందర్భంగా భారత్‌లో యాపిల్‌ ఐఫోన్ల తయారీపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో యాపిల్ తన ఉత్పత్తుల తయారీని పెంచుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. ఇండియాలో యాపిల్‌ తయారీని హైలైట్‌ చేస్తూ ‘తమ పని తాము చూసుకుంటారు’అని సీఈఓ టిమ్‌కుక్‌కు సూచించారు.

భారతదేశం లేదా చైనా వంటి దేశాల్లో అమెరికా కంపెనీలు పెట్టుబడులు పెట్టడం, తయారీ ప్లాంట్లను స్థాపించడం తగదని, అమెరికాలోనే వీటిని చేపట్టాలని ట్రంప్‌ నిరంతరం యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని కట్టడి చేసేందుకే టారిఫ్‌లను విధిస్తున్నట్లు గతంలో తెలిపారు. కొంతకాలంగా యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తిని భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల చైనాపై అధిక దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో యాపిల్‌ వంటి దిగ్గజ కంపెనీలు భారత్‌లో మరింత వేగంగా విస్తరించాలని చూస్తున్నాయి. ఈ సమయంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదీ చదవండి: కంపెనీలకు కలిసొచ్చిన యుద్ధం

2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలోని ఐఫోన్‌ ఉత్పత్తి విలువ 22 బిలియన్ డాలర్లకు చేరింది. 2026 చివరి నాటికి భారత్‌ను అమెరికా దిగుమతి చేసుకునే ఐఫోన్లకు ప్రధాన కేంద్రంగా మార్చాలని కంపెనీ యోచిస్తోంది. స్థానికంగా అధిక ఖర్చులు ఉన్నప్పటికీ, యాపిల్ చైనాపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఉత్పాదకతను నియంత్రించడానికి స్థానికంగా పెట్టుబడులు పెంచుతోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)