Breaking News

ట్రంప్‌ బ్రాండ్‌ ఇళ్లు.. లాంచ్‌ రోజునే అన్నీ సేల్‌!

Published on Thu, 05/15/2025 - 09:36

గురుగ్రామ్‌లోని ట్రంప్‌ బ్రాండ్‌ నివాసాలు రికార్డ్‌ సృష్టించాయి. స్మార్ట్‌వరల్డ్ డెవలపర్స్, ట్రిబెకా డెవలపర్స్ అభివృద్ధి చేసిన ట్రంప్ రెసిడెన్స్ లాంచ్ రోజునే మొత్తం అమ్ముడుపోయాయి. రూ.3,250 కోట్ల కేటాయింపులు నమోదయ్యాయి. ఇందులో రూ.125 కోట్ల విలువైన నాలుగు అల్ట్రా ప్రీమియం పెంట్‌ హౌస్‌లను కూడా పూర్తిగా కేటాయించినట్లు స్మార్ట్‌ వరల్డ్ డెవలపర్స్ తెలిపింది.

గురుగ్రామ్‌లో ఇది రెండవ ట్రంప్-బ్రాండెడ్ రెండో రెసిడెన్సియల్‌  ప్రాజెక్ట్. భారత్‌లో ఆరవది. న్యూయార్క్ వెలుపల రెండు ట్రంప్ టవర్లకు ఆతిథ్యం ఇచ్చిన ఏకైక నగరంగా గురుగ్రామ్ నిలిచింది. సెక్టార్ 69లో ఉన్న ట్రంప్ రెసిడెన్స్ లో 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 298 లగ్జరీ నివాసాలతో కూడిన రెండు 51 అంతస్తుల టవర్లు ఉన్నాయి.

గురుగ్రామ్‌కు చెందినస్మార్ట్‌ వల్డ్ డెవలపర్స్‌తో కలిసి ట్రంప్ ఆర్గనైజేషన్ ఇండియా పార్ట్నర్ ట్రిబెకా డెవలపర్స్ గురుగ్రామ్‌లో రెండో అల్ట్రా లగ్జరీ ట్రంప్ బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు గత నెలలో ప్రకటించింది. ఇందులో ఒక్కో నివాసం రూ.8 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ధర పలికాయి. భారత్ లో బ్రాండెడ్, అల్ట్రా లగ్జరీ లైఫ్ కు ఉన్న డిమాండ్ ను ప్రదర్శిస్తూ ప్రారంభించిన రోజే మొత్తం 298 ఇళ్లూ అమ్ముడుపోయాయి.

👉ఇది చదివారా? వీకెండ్‌ ఇల్లు.. రూ.10 కోట్లయినా పర్లేదు..

ఉత్తర భారతదేశంలో ట్రంప్ బ్రాండెడ్ రెసిడెన్షియల్ డెవలప్ మెంట్ లో ఇది రెండోది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలోని గురుగ్రామ్‌లో 2018లో ప్రారంభించిన మొదటి ట్రంప్ టవర్స్  కూడా పూర్తిగా అమ్ముడైందని, ఈ నెలాఖరులో డెలివరీకి సిద్ధంగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)