Breaking News

అడుగు దూరంలో ట్రేడ్‌ డీల్‌

Published on Fri, 07/18/2025 - 18:48

భారత్‌-యూఎస్‌ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు అడుగు దూరంలోనే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వైట్‌హౌజ్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌తో ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని చెప్పారు. బ్రాడ్ కాస్టర్ రియల్ అమెరికాస్ వాయిస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే వాణిజ్య ఒప్పందాల గురించి అడిగినప్పుడు భారత్‌తో ఒప్పందం త్వరలో కొలిక్కి వస్తుందని తెలిపారు.

భారీ సుంకాలు అమల్లోకి రాకముందే ఒక ఒప్పందానికి రావాలనే లక్ష్యంతో భారత్, అమెరికా కొన్ని నెలలుగా తీవ్ర చర్చలు జరుపుతున్నాయి. విస్తృత వాణిజ్య విధానంలో భాగంగా ఏప్రిల్ 2న భారత వస్తువులపై 27 శాతం సుంకాలను ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత జులై 9 వరకు సుంకాలను నిలిపివేయగా, ఆ తర్వాత అమెరికా ఆగస్టు 1 వరకు గడువును పొడిగించింది.

యూఎస్‌లో ప్రత్యేక బృందం

ఈ ఒప్పందంపై చర్చల కోసం భారత ప్రతినిధి బృందం అమెరికాలో ఉందని భారత ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. గత నెలలో భారత అధికారుల బృందం మరో దఫా చర్చల కోసం వాషింగ్టన్‌ పర్యటనను పొడిగించడంతో ఈ ఒప్పందంపై ప్రశ్నలు తలెతుతున్నాయి. అయితే ఈ డీల్‌పై ఇరు పక్షాలు ఆశావహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా యూఎస్‌ ఉత్పత్తులు కొన్ని భారత మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు.

ఇదీ చదవండి: ముగిసిన టీసీఎస్‌ బెంచ్‌ పాలసీ గడువు

ఇండోనేషియా తరహాలోనే?

ఇండోనేషియాతో ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం తరహాలోనే భారత్‌తో ఒప్పందం ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇరు వర్గాల మధ్య చర్చలు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే, భారత్ డెడ్ లైన్ల ఆధారంగా మరిన్ని చర్చలు జరపదని, జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే ఒప్పందాలను మాత్రమే చేసుకుంటుందని ఆయన ఇటీవల చెప్పారు. ఇప్పటివరకు ద్వైపాక్షిక వాణిజ్యం 190 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈ సంఖ్యను రెట్టింపు చేసి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని ట్రంప్, మోదీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)