Breaking News

ఫెడ్‌ ఛైర్మన్‌ను తొలగిస్తామని ట్రంప్‌ హెచ్చరిక

Published on Fri, 04/18/2025 - 11:51

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ తొలగింపు త్వరగా జరగకూడదని భావిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరోక్షంగా హెచ్చరించారు. పావెల్‌ పనితీరుపట్ల ట్రంప్‌ మండిపడ్డారు. ఇతర సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నా తాను అనుకున్న విధంగా అమెరికా వేగంగా వాటిని తగ్గించడంలేదని అభిప్రాయపడ్డారు.

తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టొచ్చని ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ఇటీవల ఓ సమావేశంలో తెలిపారు. వినియోగదారుల వ్యయంలో మందగమనం సంభవించే అవకాశముందని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అనిశ్చితి కొనసాగుతోందని వ్యాపార వర్గాల్లో అంచనాలు నెలకొన్న సమయంలో ఫెడ్‌ ఛైర్మన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గించడంలో ఏ మాత్రం తొందరపడబోమని పావెల్‌ స్పష్టం చేశారు. కానీ ట్రంప్‌ త్వరగా వడ్డీరేట్ల కోతను కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి: గ్రిడ్‌ స్థిరీకరణకు స్టోరేజ్‌ సిస్టమ్‌

ఇమిగ్రేషన్, టాక్సేషన్, నియంత్రణలు, టారిఫ్‌ వంటి విధానపరమైన మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థపై కలిగే ప్రభావంపట్ల ఫెడరల్‌ రిజర్వ్‌ స్పష్టత కోరుతోందని పావెల్‌ పేర్కొన్న మరుసటి రోజే ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) ఎప్పుడో రేట్లు తగ్గించిందని ట్రంప్‌ అన్నారు. ఇకనైనా పావెల్‌ రేట్ల కోతకు పూనుకోవాలని సూచించారు. ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌గా జెరోమ్‌ పావెల్‌ తొలగింపు త్వరగా జరగకూడదని భావిస్తున్నట్లు ట్రంప్‌ పరోక్షంగా హెచ్చరించారు. పావెల్‌ పదవీ కాలం 2026 చివరి వరకు ఉంది. ఆయనను 2017లో ట్రంప్‌ ప్రతిపాదించారు. తర్వాత 2022లో బైడెన్‌ మరో నాలుగేళ్ల పాటు ఫెడ్‌ ఛైర్మన్‌గా కొనసాగించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)