Breaking News

హాట్‌ టాపిక్‌గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా

Published on Wed, 06/10/2026 - 15:06

ఓటీటీలో దూసుకుపోతున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌  'మా బెహన్' బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌తో పాటు మరో కీలక పాత్రలో నటించిన  హీరోయిన్‌ తృప్తి దిమ్రి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. తన తాజా చిత్రంతో  క్రేజ్‌ సంపాదించుకుకున్న ఈ నటి  కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన  ప్రాపర్టీ ఇపుడు నెట్టింట విశేష చర్చగా మారింది. ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బాంద్రా వెస్ట్ ప్రాంతంలో  సుమారు రూ. 14 కోట్లతో ఒక బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం.

IndexTap.com ద్వారా అందించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ గ్రౌండ్-ప్లస్-టూ (G+2) అంతస్తుల ఇల్లు నగరంలోని అత్యంత డిమాండ్ ఉన్న కార్టర్ రోడ్ పరిసరాల్లో ఉంది.ప్రీమియం ఏరియాలోని  ఈ ప్రాపర్టీ 2,226 చదరపు అడుగుల్లో , 2,194 చదరపు అడుగుల  బిల్ట్-అప్ ఏరియాతో ఈ బంగ్లా స్పెషల్‌గా ఉంటుంది. ఈ బంగ్లా కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి. హంగూ ఆర్భాటాల కంటే సరళత, సౌకర్యానికే  ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఈ ఇల్లును తీర్చిదిద్దుకుందిట. సాఫ్ట్ టోన్స్ (మృదువైన రంగులు),  డెకర్ ఎలిమెంట్స్‌తో కూడిన 'మినిమలిస్ట్' లుక్‌తో ‍ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలాగే లివింగ్ రూమ్‌ కూడా ఎలాంటి గందరగోళం లేకుండా, చాలా ప్రశాంతంగా డిజైన్ చేశారు. మ్యూటెడ్ వాల్స్ (లైట్ కలర్ గోడలు) మధ్యలో ఉన్న ఒక 'పిస్తా గ్రీన్' కలర్ సోఫా గదికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ఓవరాల్ కలర్ ప్యాలెట్ న్యూట్రల్‌గా  ఉంటూ, ప్రతీ వస్తువు ప్రత్యేక ఆకర్షణీయంగా రూపొందించారు.  

 గ్లాస్ ఎలిమెంట్స్  స్పెషల్‌  ఎట్రాక్షన్‌  
ఇంట్లోకి సహజమైన వెలుతురు వచ్చేలా, ఇండోర్, అవుట్‌డోర్ ప్రదేశాలను కలుపుతూ విశాలంగా కనిపించేలా  పెద్ద పెద్ద గ్లాస్ ప్యానెళ్లు, పార్టిషన్లను ఉపయోగించారు.  పచ్చదనాన్ని జోడిస్తూ మొక్కలు, సాధారణ డెకర్ వస్తువులతో బాల్కనీని అలంకరించారు. ఇంకా 'డెకరేటివ్ షాడో ల్యాంప్స్' మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ సాఫ్ట్ లైటింగ్ గదికి మరింత వెచ్చదనాన్ని, ఆధునిక రూపాన్ని సంతరించుకుంది. కాగా 'కాలా', 'యానిమల్'  లాంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీల్లో నటించిన  తృప్తి దిమ్రి  ఈ నెల ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన  తాజా చిత్రం 'మా బెహన్' నటనతో మంచి మార్కులు కొట్టేసింది.  

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)