Breaking News

జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారా..? నిబంధనలు మార్పు?

Published on Fri, 02/21/2025 - 15:03

భారతీయ రైల్వే జనరల్‌ టికెట్ తీసుకొని ప్రయాణించేవారికి సంబంధించి నిబంధనలను సవరించాలని యోచిస్తోంది. రైల్వేశాఖ అమలు చేయలని చూస్తున్న ప్రతిపాదిత నిర్ణయం వల్ల కోట్లాది మంది రోజువారీ ప్రయాణికులపై ప్రభావం పడనుంది. కొత్త నిబంధనల వల్ల రైళ్లలో రద్దీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రతిపాదిత సవరణలు ఇలా..

  • నిర్దిష్ట సాధారణ టిక్కెట్లు కొనుగోలు చేసినవారు ప్రస్తుతం జనరల్‌ కేటగిరీలో ఏ రైలు అయినా ఎక్కవచ్చు. కానీ ఇకపై ఈ నియమాన్ని మార్చాలని చూస్తున్నారు. కొత్త విధానంలో భాగంగా టికెట్‌పై రైలు పేరు ప్రింట్‌ చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ఇది ప్రయాణికులు విభిన్న రైళ్లలో మారకుండా పరిమితం చేస్తుంది. నిర్దిష్ట రైళ్లలో రద్దీని నివారించడం, మెరుగైన నిర్వహణ కోసం ఈ మార్పు అవసరమని భావిస్తున్నారు.

  • జనరల్ టికెట్ వాలిడిటీ.. సాధారణ టికెట్ కొనుగోలు చేసినప్పటి నుంచి మూడు గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందని చాలా మంది ప్రయాణికులకు తెలియదు. ఈ గడువులోగా ప్రయాణం చేయకపోతే టికెట్ చెల్లదు. ఈ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.

మార్పు ఎందుకు అవసరం?

రద్దీని నివారించడానికి ఈ మార్పులు ఎంతో అవసరమని అధికారులు భావిస్తున్నారు. రద్దీగా ఉండే జనరల్‌ కంపార్ట్‌మెంట్లలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. రద్దీ కారణంగా గాయాలపాలవుతున్నారు. సాధారణ టికెట్లపై రైలు పేర్లను కేటాయించడంతో ప్రయాణికులను నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ కారణంగా జరిగిన తోపులాటలో గతంలో 18 మంది మరణించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నియమాలు సవరించాలని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: ట్రంప్‌ను కలిసిన యాపిల్‌ సీఈఓ

ప్రయాణికులపై ప్రభావం ఇలా..

ప్రయాణికులకు వారు ఏ రైలులో ప్రయాణించాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. కొత్త విధానం ద్వారా వివిధ రైళ్లలో ప్రయాణికుల రద్దీను నియంత్రించవచ్చు. తొక్కిసలాటలు, ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. ఈ విధానం వల్ల లాభాలతోపాటు నష్టాలూ ఉంటాయని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులు ఏ రైలులో అయినా ప్రయాణించవచ్చు. కానీ కొత్తగా మార్పులు చేస్తే వారికి కేటాయించిన రైలులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు తనకు కేటాయించిన రైలు మిస్ అయితే కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సిందే.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)