Breaking News

జియో.. ఎయిర్‌టెల్‌ పోటాపోటీ

Published on Mon, 12/23/2024 - 18:53

ఎయిర్‌టెల్‌ కంటే రిలయన్స్‌ జియో అక్టోబర్‌ 2024లో యాక్టివ్‌ యూజర్ల సంఖ్యను పెంచుకున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. అయితే ఇదే సమయంలో ఎయిర్‌టెల్‌ మాత్రం అధికంగా చెల్లింపులు చేసే 4జీ/ 5జీ యూజర్లను పెంచుకున్నట్లు పేర్కొంది.

ఇప్పటివరకు ఉన్న మొత్తం యాక్టివ్‌ యూజర్ల విషయంలో జియోనే అధికంగా వినియోగదారులకు కలిగి ఉంది. ఇన్‌-యాక్టివ్‌ యూజర్ల తొలగింపు కారణంగా అక్టోబర్‌ నెలలో జియో సబ్‌స్క్రైబర్లను కోల్పోయినట్లు తెలిసింది. ఎయిర్‌టెల్‌ మాత్రం తన 4జీ/ 5జీ యూజర్ బేస్‌లో వృద్ధిని సాధించింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా 3జీ/ 4జీ యాక్టివ్ యూజర్లను కోల్పోయింది. కాగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం స్వల్పంగా యూజర్లను పెంచుకుంది.

ఇదీ చదవండి: పాప్‌కార్న్‌పై జీఎస్టీ.. నెట్టింట చర్చ

జులైలో రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా మొబైల్‌ టారిఫ్‌లను 10–27 శాతం వరకు పెంచాయి. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రత్యర్థుల బాటను అనుసరించకపోగా.. సమీప భవిష్యత్తులో టారిఫ్‌ల పెంపుదల ఉండబోదని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ రాబర్ట్‌ రవి గతంలో స్పష్టం చేశారు. వినియోగదార్లను ఆకర్షించడానికి, మార్కెట్‌ వాటాను తిరిగి పొందేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల స్పామ్‌ బ్లాకర్స్, ఆటోమేటెడ్‌ సిమ్‌ కియోస్క్‌, డైరెక్ట్‌–టు–డివైస్‌ తదితర సేవలను ప్రారంభించింది.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)