Breaking News

1600 సిరీస్ కాల్స్‌ను యాప్స్ బ్లాక్ చేయలేవు: ట్రాయ్

Published on Fri, 07/10/2026 - 18:50

మొబైల్ వినియోగదారులను నిరంతరం వేధించే అయాచిత, ప్రమోషనల్, సర్వీస్‌ కాల్స్‌పై టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) శుక్రవారం కీలక వివరణ ఇచ్చింది. ఇకపై 1600 సిరీస్‌ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను థర్డ్ పార్టీ యాప్స్ (ట్రూకాలర్ వంటివి) బ్లాక్ చేయడం కానీ, ఫిల్టర్ చేయడం కానీ సాధ్యం కాదని ట్రాయ్ స్పష్టం చేసింది. అదేవిధంగా, వ్యాపార ప్రకటనల కోసం వచ్చే 140 సిరీస్ కాల్స్‌ను నియంత్రించాలంటే ప్రభుత్వ అధికారిక ‘డీఎన్డీ’ రిజిస్ట్రీ మాత్రమే ఏకైక మార్గమని తేల్చిచెప్పింది.

1600 సిరీస్ కాల్స్ ఎందుకు బ్లాక్ చేయకూడదు?

టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ (టీసీసీసీపీఆర్‌) నిబంధనల ప్రకారం.. 1600 సిరీస్ నంబర్లను బ్లాక్ చేయడం, ట్యాగ్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం చట్టవిరుద్ధం. ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏఐ, పీఎఫ్‌ఆర్‌డీఏ వంటి సర్వోన్నత సంస్థల పరిధిలోని బ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా కంపెనీలు తమ ప్రస్తుత కస్టమర్లకు కీలక సమాచారం చేరవేయడానికి ఈ సిరీస్‌ను వాడుతుండడం ఇందుకు ఒక కారణమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సంస్థలు పౌరులతో జరిపే అధికారిక లావాదేవీల సమాచారం కోసం 1600 సిరీస్‌ను తప్పనిసరి చేశారు. వినియోగదారులు ఇవి నమ్మకమైన, అధికారిక కాల్స్ అని గుర్తించి మోసపోకుండా ఉండాలనే లక్ష్యంతోనే ఈ ప్రత్యేక సిరీస్‌ను కేటాయించారు. ఒకవేళ యాప్‌లు వీటిని బ్లాక్ చేస్తే వినియోగదారులు కీలక ఆర్థిక సమాచారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

140 సిరీస్‌ ప్రమోషనల్ కాల్స్.. డీఎన్డీతోనే చెక్!

రిజిస్టర్డ్ టెలిమార్కెటర్ల కోసం కేటాయించిన 140 నంబర్ సిరీస్ ప్రమోషనల్ కాల్స్‌పై ట్రాయ్ స్పందిస్తూ.. వినియోగదారులకు తమ ప్రాధాన్యతలను ఎంచుకునే పూర్తి హక్కు ఉందని తెలిపింది. ‘వినియోగదారులు ట్రాయ్ ‘డీఎన​్‌డీ యాప్’ ద్వారా లేదా బహుళ మార్గాల్లో డూ నాట్ డిస్టర్బ్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవచ్చు. ఒకటి లేదా అన్ని రంగాల నుంచి వచ్చే ప్రమోషనల్ కాల్స్‌ను బ్లాక్ చేసే స్వేచ్ఛ కస్టమర్లకు ఉంది. ఒక రంగం నుంచి కాల్స్ స్వీకరించడానికి కస్టమర్ అంగీకరించినప్పుడు, థర్డ్ పార్టీ యాప్స్ దాన్ని స్పామ్‌గా ట్యాగ్ చేస్తే కస్టమర్ తప్పుదారి పట్టే అవకాశం ఉంది. అందుకే డీఎన్‌డీ మినహా మరే ఇతర ట్యాగింగ్ చెల్లదు’ అని ట్రాయ్‌ తెలిపింది. దీని ప్రకారం.. 140, 1600 సిరీస్ నంబర్లను వినియోగదారులు వ్యక్తిగతంగా స్పామ్, మోసం లేదా ఇతర కేటగిరీలుగా ట్యాగ్ చేయడం కుదరదని ట్రాయ్ స్పష్టం చేసింది.

భారీగా పెరిగిన స్పామ్ కాల్స్

ఒకవైపు ట్రాయ్ నిబంధనలు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో ఈ నంబర్ల ద్వారా వస్తున్న స్పామ్ కాల్స్ వినియోగదారులను ముంచెత్తుతున్నాయని ప్రముఖ యాప్ ‘ట్రూకాలర్’ సీఈవో రిషిత్ ఝున్ ఝున్ వాలా సాషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వెల్లడించిన గణాంకాలు షాక్‌కు గురిచేస్తున్నాయి.

  • 140, 1600 సిరీస్‌ల ద్వారా వచ్చే కాల్స్‌లో రోజుకు 5.1 కోట్లకు పైగా కాల్స్‌ను వినియోగదారులు సమాధానం ఇవ్వకుండా వదిలేస్తున్నారు.

  • కేవలం సర్వీస్/లావాదేవీల కోసం కేటాయించిన 1600 సిరీస్ నుంచి అక్టోబర్ 2025 నుంచి రోజువారీ స్పామ్/బ్లాకింగ్ చర్యలు ఏకంగా 3 రెట్లు (208 శాతం) పెరిగాయి.

  • గత 8 నెలల కాలంలో వినియోగదారులు ఈ సిరీస్‌లపై ఏకంగా 7.4 కోట్ల (74 మిలియన్లు) మాన్యువల్ బ్లాకింగ్ చర్యలు తీసుకున్నారు.

  • ప్రస్తుతం ట్రూకాలర్ ప్లాట్‌ఫామ్‌పై రోజూ వినియోగదారులు 140 సిరీస్ నుంచి 4 లక్షల కాల్స్, 1600 సిరీస్ నుంచి 1.25 లక్షల కాల్స్‌ను బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్!

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)