Breaking News

దేశంలో వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఎంతంటే..

Published on Thu, 05/08/2025 - 10:13

టెలికాం సేవల వినియోగదారుల్లో వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య మార్చిలో పెరిగి మొత్తం 116.37 కోట్లకు చేరుకుంది. ఇది ఫిబ్రవరిలో 116.33 కోట్లుగా ఉంది. ఈమేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వివరాలు వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ సబ్ స్క్రిప్షన్లు పెరగగా, పట్టణ సబ్ స్క్రిప్షన్లు స్వల్పంగా తగ్గాయని తెలిపింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు భారత టెలికాం పరిశ్రమలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ చందాదారుల చేరికల్లో అగ్రగామిగా నిలిచాయి.

భౌగోళికంగా ఢిల్లీ సర్వీస్‌ సెంటర్‌ అత్యధిక టెలి-సాంద్రతను కలిగి ఉంది. అంటే యూనిట్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో మొబైల్ చందాదారులను కలిగి ఉండడం. బిహార్ అతి తక్కువ టెలి-సాంద్రతను నమోదు చేసింది. పెరుగుతున్న సబ్‌స్రైబర్ల సంఖ్య దేశంలో కొనసాగుతున్న డిజిటల్ పరివర్తనను హైలైట్ చేస్తుంది. ఎక్కువ మంది గ్రామీణ వినియోగదారులు ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తున్నారు. యూజర్ డెమోగ్రాఫిక్స్, నెట్‌వర్క్‌ డిమాండ్లకు సంబంధించి టెలికాం ఆపరేటర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.

ఇదీ చదవండి: 27 ఎయిర్‌పోర్ట్‌లు, 430 విమానాలు నిలిపివేత

వైర్‌లెస్‌ సబ్‌స్రైబర్ల సంఖ్య పెరగడం చాలా అంశాలను ప్రభావితం చేస్తుంది. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీకి అవకాశం అందిస్తుంది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ సేవలు ఎక్కువ మంది పొందేందుకు వీలవుతుంది. ఈ-కామర్స్, ఫిన్ టెక్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలు వృద్ధి చెందుతాయి. మొబైల్ వినియోగదారులకు సేవలందించే వ్యాపారాలు.. ముఖ్యంగా మొబైల్‌ అప్లికేషన్లు, స్ట్రీమింగ్ సేవలు, డిజిటల్ సర్వీసులు పెరుగుతాయి. హై-స్పీడ్ కనెక్టివిటీని నిర్ధారించడానికి నెట్‌వర్క్‌ విస్తరణకు, 5జీ వినియోగానికి టెలికాం ప్రొవైడర్లు మరింత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)