Breaking News

పాకిస్తాన్‌కు మరో ఎదురు దెబ్బ.. దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు!

Published on Sun, 06/18/2023 - 20:23

పాక్‌ ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఐఎంఎఫ్‌ ప్యాకేజీ కోసం వేచి చూస్తోంది. అయితే, ఈ తరుణంలో పాక్‌ నుంచి పలు అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు నిలిపివేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం యూకే ఆయిల్‌ కంపెనీ ‘షెల్‌’ పాకిస్తాన్‌ నుంచి వెళ్లిపోయింది. తాజాగా, ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టయోటా సైతం తన తయారీ యూనిట్లను షట్‌ డౌన్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై టయోటా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

టయోటా ఇండస్‌ మోటార్స్‌ పాకిస్తాన్‌కి చెందిన తన తయారీ ప్లాంట్‌ను శాస్వతంగా మూసేసింది. దేశం విడిచి పెట్టి వెళ్లిపోనుంది అంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయంటూ బలోచిస్తాన్‌ జర్నలిస్ట​ సఫర్‌ ఖాన్‌ ట్వీట్‌ చేశారు. టయోటా ఇండస్ పాకిస్థాన్‌లో తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు వచ్చిన నివేదికపై స్టాక్ వ్యాపారి జెహాన్‌జేబ్ నవాజ్ వివరణ కోరారు. "వార్తలు సరైనవి అయితే, ఇప్పటికే బుక్ చేసిన కార్ల పరిస్థితి ఏమిటి? ముందస్తు చెల్లింపులు, డీలర్‌షిప్‌ల గురించి చెప్పాలని తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో, ఏఆర్‌వై న్యూస్ ప్రకారం.. కంపెనీ సరఫరా గొలుసులో అంతరాయం కారణంగా టయోటా ఇండస్ మోటార్స్ ఉత్పత్తిని నిలిపివేసింది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ జనరల్ మేనేజర్‌కు రాసిన లేఖలో, కంపెనీ మేనేజ్‌మెంట్ "లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (LC) తెరవడంలో జాప్యం, ఇన్వెంటరీ కొరత" కారణంగా దాని ఉత్పత్తిని మూసివేస్తున్నట్లు పేర్కొంది. 

కంపెనీ తన ఉత్పత్తిని నిలిపివేయడం ఇది రెండోసారి. గత ఏడాది డిసెంబర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) నుండి దిగుమతి అనుమతులలో జాప్యం కారణంగా కంపెనీ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఆటో మొబైల్‌ రంగానికి సీకేడీ కిట్‌లు, ప్యాసింజర్ కార్ల విడిభాగాల దిగుమతికి ముందస్తు అనుమతి పొందేందుకు పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ కొత్త మెకానిజంను ప్రవేశపెట్టిందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు టయోటా శాస‍్వతంగా మూసివేస్తున్నట్లు నివేదికలు వెలుగులోకి రావడంపై పాక్‌ ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా అసలే ఆర్ధిక పరమైన ఇబ్బందులు పడుతున్న ఈ కఠిన సమయంలో అంతర్జాతీయ కంపెనీలు తరలి వెళ్లడం.. దేశ ఎకానమీకి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

చదవండి :  విమాన టికెట్‌ ధరలు చాలా తక్కువేనంటూ.. కేంద్రంపై చిదంబరం సెటైర్లు!

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?