Breaking News

11.2 లక్షల టయోటా కార్లు వెనక్కి! అగ్ర రాజ్యంలో అత్యధికం..

Published on Thu, 12/21/2023 - 19:28

ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'టయోటా' (Toyota) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 11.2 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇన్ని కార్లకు కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, ఈ కార్లలో ఉన్న లోపాలు ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2020 నుంచి 2022 మధ్యలో తయారైన అవలాన్, కామ్రీ, కరోలా, ఆర్ఏవీ4, లెక్సస్ ఈఎస్ 250, ఈఎస్300హెచ్, ఈఎస్350, ఆర్ఎక్స్350 హైల్యాండర్, సియన్నా హైబ్రిడ్ వెహికిల్స్ వంటి వాటికి రీకాల్ ప్రకటించింది.

సమస్య ఏంటంటే?
2020 నుంచి 2022 మధ్యలో తయారైన ఈ కార్లలో ఎయిర్ బ్యాగులో ఏర్పడే లోపం కారణంగా ఆక్యుపెంట్ క్లాసిఫికేషన్ సిస్టమ్ (OCS) సెన్సార్‌లకు సంబంధిచిన సమస్యలు తలెత్తవచ్చని సంస్థ భావించి, దీనిని భర్తీ చేయడానికి ఈ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఒక్క అమెరికాలో మాత్రమే సుమారు 10 లక్షల కార్లలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. రీకాల్ సమయంలో సదరు వినియోదారుడు తన కారుని కంపెనీ అధికారిక డీలర్షిప్ వద్ద సమస్యను పరిష్కరించుకోవచ్చు. ప్రస్తుతానికి కంపెనీ కార్ ఓనర్లకు సమాచారం అందించలేదని, 2024 ఫిబ్రవరి సమయంలో అందరికి సమాచారం అందించే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్‌ - కారణం ఇదే!

కార్లలోని లోపాలకు పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించడం ఇదే మొదటి సారి కాదు, గతంలో చాలా కంపెనీలు ఇలా రీకాల్ ప్రకటించి సమస్యలను పరిష్కరించాయి. ఇటీవల టెస్లా కూడా ఆటోపైలట్ సిస్టమ్‌లోని లోపాన్ని సరి చేయడానికి 20 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు