Breaking News

హైబ్రిడ్‌ మోడళ్లపైనే టయోటా ఫోకస్‌

Published on Sat, 11/26/2022 - 10:51

ముంబై: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను భవిష్యత్తులో ప్రవేశపెడతాం. ప్రస్తుతానికి హైబ్రిడ్‌ మోడళ్లపైనే టయోటా కిర్లోస్కర్‌ ఫోకస్‌ చేసిందని కంపెనీ వైస్‌ చైర్మన్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ తెలిపారు. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో హైబ్రిడ్లపై దృష్టిసారించారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘కర్బన ఉద్గారాలను తగ్గించడమే దేశ లక్ష్యం అని నేను భావిస్తున్నాను.

మీరు దానిని సమగ్రంగా, శాస్త్రీయ ప్రాతిపదికన చూడాలి. అదే మేము చేస్తున్నాము’ అని చెప్పారు.  సమీప కాలంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు తీసుకువచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పునరుత్పాదక విద్యుత్తు వాటా కనీసం 50–60 శాతానికి చేరితే తప్పనిసరిగా ఎలక్ట్రిక్‌ వాహనాలను పరిచయం చేస్తామని స్పష్టం చేశారు. ఇన్నోవా హైక్రాస్‌ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. 

ఇవీ ఇన్నోవా హైక్రాస్‌ ఫీచర్లు.. 
మల్టీ పర్పస్‌ వెహికల్‌ ఇన్నోవా ప్లాట్‌ఫామ్‌పై హైక్రాస్‌ పేరుతో హైబ్రిడ్‌ వెర్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. బుకింగ్స్‌ మొదలయ్యాయి. జనవరి మధ్యకాలం నుంచి డెలివరీలు ఉంటాయి. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తోనూ లభిస్తుంది. సెల్ఫ్‌ చార్జింగ్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ సిస్టమ్‌తో 2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిజన్‌ పొందుపరిచారు. మైలేజీ లీటరుకు 21.1 కిలోమీటర్లు అని కంపెనీ ప్రకటించింది.

డైనమిక్‌ రాడార్‌ క్రూజ్‌ కంట్రోల్, ప్రీ కొలీషన్‌ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, వెహికల్‌ స్టెబిలిటీ కంట్రోల్, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ–డ్రైవ్‌ సీక్వెన్షియల్‌ షిఫ్ట్‌ సిస్టమ్, 7–8 సీట్లు, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ జోడించారు.  ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవా వాహనాలు 26 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2005లో భారత్‌లో ఇది రంగ ప్రవేశం చేసింది. ఇప్పటి వరకు 10 లక్షల పైచిలుకు ఇన్నోవాలు రోడ్డెక్కాయి. కంపెనీ మొత్తం అమ్మ కాల్లో ఈ మోడల్‌ వాటా ఏకంగా 50 శాతం ఉంది.

చదవండి: బైక్ కొనాలనుకునే వారికి షాక్.. ధరలు పెంచిన ప్రముఖ కంపెనీ!


   

Videos

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)